Telangana secretariat shuts down permanently తెలంగాణ సచివాలయానికి తాళాలు..

Telangana secretariat shuts down permanently

telangana new secretariat,telangana secretariat,telangana news,new secretariat building,telangana secretariate,telangana government,telangana new secretariat plan,telangana govt,telangana new secretariat design,telangana to build new secretariat,telangana new secretariat building,new secretariat,demolition of telangana secretariat,telangana secretariate employees,petition to telangana secretariate,telangana secratariate close

The six-decade-old Telangana secretariat which has been used by both the Telugu states has shut down permanently on Sunday with the officials locking up the entrance gates.

ఆరు దశాబ్దాల.. తెలంగాణ సచివాలయానికి తాళాలు..

Posted: 09/30/2019 10:26 AM IST
Telangana secretariat shuts down permanently

తెలంగాణ సచివాలయానికి ఇవాల్టీ నుంచి మూతపడనుంది. అదేంటి వాళ్లకు కూడా ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించిందా? అన్న అనుమానాలు వస్తన్నాయా.? లేదు. గత ఆరు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించిన పాత సచివాలయానికి తాళం పడనుంది. పాత సచివాలయ భవనం వాస్తుదోష పూరితమైందని భావించిన కేసీఆర్ సర్కార్.. దానిని ఆ స్థలం నుంచి తరలించాలని భావించింది. అయితే రాష్ట్ర హైకోర్టు కొత్త సచివాలయ భనవ నిర్మాణం అవసరం లేదని తేల్చచెప్పడంతో.. ఇక ఆ భవనాన్ని అక్కడి నుంచి తరలించే పనులనులో నిమగ్నమైంది ప్రభుత్వం.

గత రెండు నెలలుగా సచివాలయంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నింటిని బూర్గుల రామకృష్ణ భవనానికి అధికారులు తరలించారు. పలుసార్లు సీఎం ఆదేశించిన కార్యాలయం తరలింపులో జాప్యం జరుగుతుండటంతో సీఎస్‌పై గులాబీ బాస్ సీరియస్ అయినట్లు కూడా సమాచారం. అయితే కొందరు అధికారులు మాత్రం కార్యాలయాన్ని తరలించిన సచివాలయం నుంచే పనులు చేస్తున్నారు. మరోవైపు కొంతమంది మంత్రుల శాఖలకు చెందిన అధికారులు కూడా సచివాలయం నుంచే పనులు నిర్వహిస్తున్నారు.

అయితే తన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ పాత సచివాలయం నుంచే అధికారులు కార్యకలాపాలు సాగించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం వరకు అన్ని శాఖల్ని తరలించి... సోమవారం ఉదయానికి సచివాలయం భవనానికి తాళం వేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సచివాలయ ప్రాంగణం ఖాళీ చేసి వెంటనే వెళ్లిపోవాలని అన్ని ప్రభుత్వ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి.

సచివాలయాన్ని పునర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే 90 శాతానికి పైగా ప్రభుత్వ శాఖలు తమ ఫైళ్లను తరలించడంతో చాలా బ్లాకులు ఖాళీ అయ్యాయి. సాధారణ శాఖ సిబ్బంది శుక్రవారం బృందాలుగా ఏర్పడి పాత సచివాలయంలోని బ్లాకులను పరిశీలించారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి సచివాలయం ప్రధాన ద్వారానికి తాళం వేసేందుకు జీఏడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో తాళం చెవులు ఉంటాయని, అవసరమైన శాఖలు అక్కడి నుంచే తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles