mla pedda reddy slams jc diwakar reddy జేసీకి వాచ్ మెన్ ఉద్యోగం కూడా ఇవ్వరు: పెద్దిరెడ్డి

Ysrcp tadipatri mla pedda reddy fires on ex mp jc diwakar reddy

ysrcp tadipatri mla pedda reddy slams jc diwakar reddy, mla pedda reddy fires on jc diwakar reddy, former ananthapur mp jc diwakar reddy, ysrcp mla, tadipatri mla, pedda reddy, jc diwarkar reddy, former mp, double standards, joker, andhra pradesh, politics

ysrcp tadipatri mla pedda reddy fires on ex mp jc diwakar reddy on his double standards, says cm jagan will not give him the post of watchman to him.

‘‘జోకర్ దివాకర్ రెడ్డికి.. సీఎం వాచ్ మెన్ ఉద్యోగం కూడా ఇవ్వరు.’’

Posted: 09/19/2019 05:39 PM IST
Ysrcp tadipatri mla pedda reddy fires on ex mp jc diwakar reddy

అక్రమ మైనింగ్, టీడీపీ హయాంలో చేసిన అక్రమాల నుంచి బయటపడేందుకే జేసీ దివాకర్ జగన్ భజన చేస్తున్నారని వైఎస్సార్‌‌సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం జేసీకి వెన్నెతో పెట్టిన విద్యని.. ఇలా డబుల్ స్టాండర్డ్స్ ను పాటించే జేసిని అందరూ ఓ జోకర్ గా, కమెడియన్‌ గా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. జేసీకి తన ఇంటి వాచ్‌మెన్‌ ఉద్యోగం కూడా సీఎం జగన్ ఇవ్వరంటూ సెటైర్లు పేల్చారు.

దివాకర్‌రెడ్డి మతి తప్పి మాట్లాడుతున్నారని.. ఆయన్ను ప్రజలు కూడా చీదరించుకుంటున్నారన్నారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిలకు ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా పద్ధతిని మార్చుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు.  చంద్రబాబు హయాంలో బంట్రోతు ఉద్యోగం చేసిన దివాకర్‌రెడ్డి.. ఇప్పడు బీజేపీని మోసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
టీడీపీలో ఉన్న జేసీ.. కడప ఎయిర్ పోర్టులో కన్నా లక్ష్మీనారాయణను ఎందుకు కలిశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య సుమారుగా అరగంటపాటు చర్చలు జరిగాయని.. ఆ చర్చల్లో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయో జేడీ మీడియాకు చెప్పగలరా అని పెద్దిరెడ్డి నిలదీశారు. తాడిపత్రి మున్సిపాలిటీలో నీటి సమస్యకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కారణమని ఆరోపించారు పెద్దారెడ్డి.

కాంట్రాక్టర్‌ ను మరమ్మతుల పనులు చేయనివ్వకుండా జేసి బెదిరించారని పెద్దిరెడ్డి అరోపించారు. ఇక తన హయాంలో తన నియోజకవర్గంలో తాగునీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎంపీగా వున్న ఆయన కనీసం స్పందించలేదన్నారు. తాము మరమ్మతులు చేసి తాగునీటి సరఫరాను మొదలుపెట్టామన్నారు. తాడిపత్రిలో వ్యాపారులతో కిలో చికెన్‌కు రూ. 20 పర్సేంటేజీ వసూలు చేశారని.. తాను చేసిన అరోపణలపై జేసీ బ్రదర్స్‌తో బహిరంగా చర్చకు కూడా సిద్ధమని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp mla  tadipatri mla  pedda reddy  jc diwarkar reddy  double standards  joker  andhra pradesh  politics  

Other Articles