Petrol, diesel prices likely to rise with 19.5 percent భారగీ పెరగనున్న ఇంధన ధరలు..

Petrol diesel prices may jump rs 5 7 per liter soon report

petrol, diesel, crude, refinery, retail price, VAT, excise duty, dealer commission, dealer price, fuel cost, saudi drone attack

Following the largest ever-disruption of crude production in Saudi Arabia amid drone attacks on its key facilities, prices of petrol and diesel in India may shoot up by Rs 5 to 6 a litre in next fortnight, experts said.

భారగీ పెరగనున్న ఇంధన ధరలు.. లీటరకు రూ.7 వరకు పెంపు.?

Posted: 09/17/2019 11:24 AM IST
Petrol diesel prices may jump rs 5 7 per liter soon report

పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ముడి చమురు ధర పరుగు పెట్టడం ఇందుకు కారణం. ప్రపంచపు అతిపెద్ద ఆయిల్ రిఫైనర్ సౌదీ ఆరామ్‌కోపై డ్రోన్ ఎటాక్ ఇందుకు కారణం. క్రూడ్ ధరలు గల్ఫ్ యుద్ధం తర్వాతి నుంచి చూస్తే మళ్లీ ఇప్పుడు భారీగా పెరిగాయి. దీంతో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. డ్రోన్ దాడి కారణంగా రోజు వారి ఆయిల్ ఉత్పత్తి దాదాపు 5.7 మిలియన్ బ్యారెల్స్ తగ్గొచ్చని ఆరామ్‌కో పేర్కొంది.

అయితే సౌదీ ఆయిల్ మంత్రి మాత్రం భారత్ కు క్రూడ్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. సౌదీ అరేబియాలో క్రూడ్ ఉత్పత్తికి విఘాతం కలగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు రానున్న రోజుల్లో రూ.6 వరకు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. క్రూడ్ ధరలు ప్రస్తుత స్థాయిల్లోనే కదలాడితే దేశీ ఇంధన ధరలు పెరగొచ్చని హెచ్‌పీసీఎల్ తెలిపింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర గత రెండు రోజుల కాలంలో ఏకంగా దాదాపు 20 శాతం పెరిగిన విషయ తెలిసిందే.

క్రూడ్ ధర బ్యారెల్‌కు 60 డాలర్ల నుంచి 71.95 డాలర్ల స్థాయికి చేరింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చనే అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు పైకి కదిలాయి. పెట్రోల్ ధర 15 పైసలు, డీజిల్ ధర 16 పైసలు చొప్పున పెరిగింది. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.72కు చేరింది. డీజిల్ ధర రూ.71.49కు ఎగసింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  diesel  crude  refinery  retail price  VAT  excise duty  dealer commission  dealer price  fuel cost  saudi drone attack  

Other Articles