Aghori sadhus visit TTD chairman's house టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు

Aghori sadhus visit ttd chairman yv subba reddy s house

Aghori sadhus, TTD chairman YV SubbaReddy, Vijayawada, Tirumala Tirupati Devasthanams, Vijayawada, Andhra Pradesh

A group of Aghori Sadhus from Himalayan region has visited Tirumala Tirupati Devasthanams (TTD) chairman YV Subba Reddy's residence. It's reported that the Sadhus have performed special pujas at the house.

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు

Posted: 09/14/2019 05:53 PM IST
Aghori sadhus visit ttd chairman yv subba reddy s house

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు.. ఆయన బాబాయి అయిన, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు రావడం సంచలనం సృష్టిస్తోంది. హిమాలయాల్లో ఘోర తపస్సు చేసుకునే అఘోరాలు.. విజయవాడలోని వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వచ్చి ప్రత్యేక పూజలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వారు వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలుస్తోంది.

అయితే అఘోరాల చేత పూజలు చేయిస్తే అంతా శుభం జరుగుతుందన్న పలువురు పండితుల మాటలు విన్న సుబ్బారెడ్డి వారిని తన నివాసానికి అహ్వానించారని కూడా తెలుస్తోంది. హిమాలయాల పర్వతాల మధ్య ఘోర తపస్సు చేసే అఘోరాలు సుబ్బారెడ్డి అహ్వానాన్ని మన్నించి ఆయన ఇంటికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇంట్లో ప్రత్యేక పూజల అనంతరం వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు అఘోరాల ఆశీస్సులు తీసుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

అఘోరాల ఆశీస్సులు అందుకుంటున్న టీటీడీ చైర్మన్ ఫొటోలు వైరల్ కావడంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అఘోరాలు వైవీ సుబ్బారెడ్డి తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తున్న ఫొటో ఆసక్తి రేపుతోంది. బీజేపీ నేతకు చెందిన మరో ఫొటో కూడా సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బీజేపీ సీనియర్ నేత, నరసాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు అఘోరాల ఆశీస్సులు తీసుకుంటున్న మరో ఫొటో కూడా వైరల్ అయింది. గంగరాజు కుటుంబ సభ్యులను అఘోరాలు ఆశీర్వదిస్తున్న ఫొటో చక్కర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh