pawan kalyan requests govt to allocate land కేసీఆర్ ప్రభుత్వం పెద్ద మనస్సు చేసుకోవాలి: పవన్ కల్యాణ్

Pawan kalyan request kcr govt to allocate land to film industry workers

Pawan Kalyan, Janasena, CM KCR, film industry workers, chitrapuri, TRS, CM K Chandrashekar Rao, Telangana, Politics

Jana Sena party President Pawan Kalyan requests Telangana Government and CM KCR to allocate land to film industry workers and fullfill their own house dream come true.

కేసీఆర్ ప్రభుత్వం పెద్ద మనస్సు చేసుకోవాలి: పవన్ కల్యాణ్

Posted: 09/10/2019 07:45 PM IST
Pawan kalyan request kcr govt to allocate land to film industry workers

సినీ కార్మికుల ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ పెద్ద మనసు చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ఇళ్ల నిర్మాణం కోసం మరికొంత స్థలం కేటాయించాలని విజ్ఞ‌ప్తి చేశారు. దాదాపుగా 30 వేల మంది సినీకార్మికులకు గూడు కేటాయించే విషయామై ప్రభుత్వం దృష్టిసారించాలని జనసేనాని కొరారు. హైదరాబాద్‌ చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కని సినీ కార్మికుల కోసం.. మరికొంత స్థలం కేటాయించి స్వంతఇంటికలను సాకారమయ్యేలా చేయాలని కోరారు.

హైదరాబాద్‌ జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగు సినీ వర్కర్స్‌ కోపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ కార్యవర్గ వభ్యులతో పవన్‌ కల్యాణ్ సమావేశమయ్యారు. కేటాయింపుల్లో కార్మికులు పడుతున్న ఇబ్బందులను కమిటీ ముందుకు తీసుకొచ్చారు. హౌసింగ్‌ సొసైటీ సభ్యులు కూడా ఇళ్లు కేటాయింపుల్లో ఇబ్బందుల్ని పవన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్ల స్థలం కేటాయింపుపై అవసరమైతే ప్రభుత్వానికి జనసేన పార్టీ తరపున వినతి పత్రం అందిస్తామన్నారు పవన్ కల్యాణ్.

హిందీ సినిమాకు ముంబై కేంద్రం అయినట్లు.. తెలుగు ఇండస్ట్రీకి హైదరాబాద్ కేంద్రమన్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యను పెద్ద మనసుతో పరిష్కరిందాలని కోరారు. చిత్ర పరిశ్రమ కోట్లాది మందికి వినోదం అందిస్తుందని.. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చుతుందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. మద్రాసు నుంచి హైదరాబాద్ కు చిత్రపరిశ్రమను తరలించే పరిస్థితుల్లో.. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి 4వేల మంది కార్మికులకు ఇళ్ల నిర్మాణం కోసం 67.16 ఎకరాలు కేటాయించారని గుర్తు చేశారు.

ఆతర్వాత ఇండస్ట్రీ పెద్దదయ్యిందని.. అనేక మందికి సినిమా పరిశ్రమ ఉపాధి కల్పించడంతో తెలుగు రాష్ట్రాలలోని పలువురు నగరానికి వచ్చి ఇక్కడే అద్దె ఇల్లలోన నివాసాలు వుంటున్నారని అన్నారు. దాదాపు 35వేల మంది కార్మికులు పరిశ్రమను నమ్ముకుని ఉన్నారు.. ప్రభుత్వం కేటాయించిన స్థలం సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని మరికొంత స్టలం కార్మికుల గూడు కోసం కేటాయించాలన్నారు. అలాగే చిత్రపురి కాలనీ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి మిగిలి ఉన్న మూడెకరాల స్థలంలో ఇల్లులేని కార్మికుల కోసం వీలైనంత త్వరగా ఇల్లు నిర్మించాలనని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  CM KCR  film industry workers  chitrapuri  TRS  Telangana  Politics  

Other Articles