Traffic restrictions for Ganesh idol immersion వినాయక నిమజ్జనానికి నగరంలో పోలీసుల ఆంక్షలు

Traffic restrictions in hyderabad for ganesh idol immersion

ganesh chaturthi 2019, ganesh chaturthi visarjan, ganesh chaturthi in Telangana, ganesh immersion in Hyderabad, ganesh idol, ganesh chaturthi ganesh murti, Ganesh bhagwan murti, ganesh chaturthi mela, ganesh puja, how to celebrate Ganesh Chaturthi, ganesha festival, panchmi 2019, 2019 ganesh chauth, ganesh chaturthi mela, 2019 mein ganpati chaturthi kab hai, ganesh festival wishes messages

The pious 10-day long festival celebrated on the mythological occasion of Lord Ganesha’s birth is at its peak. Ganesh Chaturthi, a popular festival of India subcontinent is being celebrated with devotional fervour all across the country.

వినాయక నిమజ్జనానికి నగరంలో పోలీసుల ఆంక్షలు

Posted: 09/10/2019 05:23 PM IST
Traffic restrictions in hyderabad for ganesh idol immersion

వినాయక ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో గణేషుణ్ణి నిమ్జనాలకు తరలివెళ్తున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు భక్త సమాజం సభ్యులు. అటు ప్రభుత్వం కూడా నిమజ్జనాలకు పూర్తి ఏర్పాటు చేసింది. కాగా, ఈ నెల 12న గురువారం రోజు హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జోనోత్సవం జరగనుంది. బాలాపూర్ గణేశ్ మొదలుకొని, ఖైరతాబాద్ వినాయకుడు సహా వేల సంఖ్యలో విగ్రహాలను నగరంలోని వివిధ చెరువుల్లో నిమజ్జనం చేయనున్నారు.

దీనికోసం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు గణేశ్ నిమజ్జనానికి నగర పోలీసులు కూడా అంతా సిద్ధం చేశారు. ఊరేగింపులు ప్రశాంతంగా జరగడం కోసం కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనంలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు, గణేశ్ శోభాయాత్రకు సంబంధించి ట్రాఫిక్ అదనపు డీసీపీ అనిల్ కుమార్ మంగళవారం వివరాలు వెల్లడించారు.

బాలాపూర్‌ గణేశ్‌ శోభాయాత్ర 18 కిలోమీటర్ల మేర ఉంటుందని తెలిపారు. గణేశ్‌ శోభాయాత్రకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. శోభాయాత్రకు 17 ప్రధాన మార్గాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. సుమారు 10వేల లారీలతో గణేశ్ నిమజ్జనం సాగుతుందని తెలిపారు. చిన్న చిన్న గణేష్ విగ్రహాలను ట్యాంక్ బండ్ మీదకు అనుమతి లేదని తెలిపారు. హైదరాబాద్‌లో నిమజ్జనోత్సవానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్నారని పేర్కొన్నారు.

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

గణేశ్ నిమజ్జనం సందర్భంగా గురువారం ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నట్లు అదనపు డీసీపీ అనిల్ కుమార్ తెలిపారు. ప్రైవేట్ వాహనాలను నగరంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ప్రైవేట్ వాహనాల పార్కింగ్ కోసం నగర వ్యాప్తంగా 10 ప్రాంతాలను ఎంపిక చేశామని వెల్లడించారు. నిజాం కాలేజ్, లోయర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ చేసుకోవచ్చని తెలిపారు.

అయినప్పటికీ.. నగరవాసులు వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టునే ఉపయోగించాలని సూచించారు. నిమజ్జనాలు చూసేందుకు వచ్చేవారు మెట్రోలో ప్రయాణించండం మేలని అనిల్‌ కుమార్‌ చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కి వెళ్లే ప్రయాణికులు నగర శివార్ల నుంచి ప్రయాణించాలని కోరారు. ట్రాఫిక్ సమాచారం కోసం మూడు టోల్ ఫ్రీ నంబర్లతోపాటు గూగుల్ మ్యాప్ ద్వారా పర్యవేక్షణ చేస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ganesh idol  ganesh chaturthi  ganesh immersion  Hyderabad  Traffic diversions  

Other Articles