idbi bank repo linked retail loans ఖాతాదారులకు షాకిస్తున్న బ్యాంకులు

Idbi bank repo linked retail loans effective from october 1

RBI, SBI, Axis bank, IDBI bank, Fixed Deposits, Auto Loans, Home Loan, Interest Rate, Small Savings, Banks, Deposit, New Rule

The State Bank of India has made it mandatory for banks from October 1 to link new floating-rate loans to an external benchmark.

ఐటీబిఐ బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్..

Posted: 09/10/2019 02:53 PM IST
Idbi bank repo linked retail loans effective from october 1

రిజర్వు బ్యాంక్ తాజాగా జారీ చేసిన అదేశాలను దేశంలోని బ్యాంకులు సాధ్యమైనంత త్వరగా ఆచరణలో పెట్టడంతో.. నిర్ణయాలు కూడా అదే విధంగా వేగంగా తీసుకుంటున్నాయి. ఆర్బీఐ కీలక రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి. కొన్ని బ్యాంకులు రుణ రేట్లు తగ్గిస్తే.. మరికొన్ని బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత విధిస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఖాతాదారులకు సమన్యాయం చేస్తున్నాయి.

ఇటు డిపాజిట్ రేట్లతోపాటు రుణ రేట్లు కూడా తగ్గిస్తున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్ తాజాగా రెపో లింక్డ్ రిటైల్ రుణాలు ఆవిష్కరించింది. అక్టోబర్ 1 నుంచి ఈ ఇవి కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి. దీంతో హోమ్ లోన్, వాహన రుణాలు, ఇతర రుణాల వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. ఆర్‌బీఐ సెప్టెంబర్ 4న ఫ్లోటింగ్ రుణాలను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌తో లింక్ చేయాలని బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే.

మరోవైపు ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. సెప్టెంబర్ 9 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. బ్యాంక్ 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితిలో ఎఫ్‌డీలను ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ ప్రస్తుతం ఎఫ్‌డీలపై 3.5 నుంచి 7.75 శాతం శ్రేణిలో వడ్డీ రేటును అందిస్తోంది. మరోవైపు ఎస్బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. ఇవాళ్టి నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు అమలులోకి వచ్చింది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించడం 15 రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. దీంతో బ్యాంక్‌లో డిపాజిట్ చేసేవారికి తక్కువ రాబడి లభిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  SBI  Axis bank  IDBI bank  Fixed Deposits  Auto Loans  Home Loan  Interest Rate  

Other Articles