Mom asleep, Kerala baby falls off moving jeep అడవి దారిలో ఒంటరిగా చిన్నారి.. జీపు నుంచి పడిపోయి..

Toddler has a miraculous escape after falling off from jeep in dense munnar forest

Munnar baby escape, Munnar toddler escape, Toddler falls of jeep, Baby falls of jeep, Baby escape, Baby in forest, Child escape, Rajamala toddler escape, munnar forest area toddler escape, idukki toddler escape, toddler munnar forest officials, Kerala, crime

A one-year-old toddler had a miraculous escape as she accidentally fell off a moving jeep on a road inside a dense forest in Munnar and crawled to a nearby check-post in Rajamala.

ITEMVIDEOS: అడవి దారిలో ఒంటరిగా చిన్నారి.. జీపు నుంచి పడిపోయి..

Posted: 09/10/2019 09:56 AM IST
Toddler has a miraculous escape after falling off from jeep in dense munnar forest

కారులో వెళ్తున్నా.. లేక బైక్ పై వెళ్తున్నా.. సాధారణంగా చిన్న పిల్లలు వుంటే ఆ తల్లిదండ్రులు అతిజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందేనని పెద్దలు చెప్పిన మాటలు అక్షరసత్యాలని ఈ ఘటన నిరూపిస్తోంది. జీపులో వెళ్తున్న వాళ్లు కనీసం బాబను తమపై ఎత్తుకోకుండా.. లేదా జాగ్రత్తగా వ్యవహరించకపోవడంతో ఆ బాలుడు తమ తల్లిదండ్రులతో వెళ్తున్నా కారులో రక్షణపై ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వేగంగా వెళ్తున్న వాహనం నుంచి ఏడాది వయసున్న చిన్నారి కిందపడ్డాడు.

ఆ విషయాన్ని గమనించని తల్లిదండ్రులు అలానే వెళ్లిపోయారు. కేరళలోని ఇడుక్కి జిల్లా మున్నార్ పర్యాటక ప్రాంతంలో జరిగిందీ ఘటన.రాత్రి వేళ వేగంగా వెళ్తున్న ఓ ఎస్‌యూవీ నుంచి చిన్నారి కిందపడడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అయితే, పాప ఎలా కిందపడిందన్నది మిస్టరీగా మారింది. కిందపడిన చిన్నారి రోడ్డుపై అటూఇటూ పాకుతూ కనిపించింది. అంత వేగంలో కిందపడినా చిన్నారికి ఏమీ కాకపోవడం గమనార్హం.

ఆ దారి గుండా ప్రయాణించిన కొందరు వాహనదారులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వెతికారు. చిన్నారి కనిపించకపోవడంతో సీసీటీవీ కెమెరాలను పరిశీలించి రోడ్డుపక్కన ఉన్నట్టు గుర్తించి రక్షించారు. వెంటనే సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. మరోవైపు, కాసేపటికే ఏడాది వయసున్న తమ కుమార్తె కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ చిన్నారిని అధికారులు వారికి అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baby escape  Munnar forest  toddler  parents  jeep  Rajamala  idukki  toddler  Kerala  crime  

Other Articles