ysrcp mla's white ration card post goes viral వైసీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పల రాజు పోస్టు వైరల్..

Ysrcp mla seediri appala raju white ration card post goes viral

ysrcp mla white ration card, mla seediri appala raju white ration card, palasa mla white ration card, social media white ration card, white ration card andhra pradesh, ysrcp mla, mla seediri appala raju, palasa mla, social media, white ration card, viral news, andhra pradesh, politics

ysrcp mla seediri appala raju white ration card post after village volunteer delivers ration to his house, goes viral on social media

వైసీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పల రాజు పోస్టు వైరల్.. విమర్శలు

Posted: 09/10/2019 10:45 AM IST
Ysrcp mla seediri appala raju white ration card post goes viral

ఆంద్రప్రదేశ్ లో దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. తెల్లరేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికీ ఈ బియ్యాన్ని గ్రామ వాలంటీర్లు స్వయంగా అందజేస్తున్నారు. ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. గ్రామ వాలెంటీరు ఏకంగా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజుకు నాణ్యమైన బియ్యం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ఫోటో దిగి ఫేస్‌బుక్‌లో పెట్టారు. ‘జీఎంఈ కాలనీలోని తన ఇంటికి వాలంటీర్ ఎస్. ప్రసాద్ వచ్చి రేషన్ అందజేశారు.. నాకు బియ్యం అప్పగించిన విధానం ప్రకారం.. వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది. గుమ్మం వద్దకే వచ్చి వారుసేవలు అందిస్తున్నారు. ఇదే పాలనలోని పారదర్శకత’ అని ఆయన పోస్టు చేశారు. ఇది వైరల్ కావడంతో ఆయనకు తెల్ల రేషన్‌కార్డు ఎలా వచ్చిందంటూ సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నించారు.

అయితే, ఈ పోస్ట్ కిందే ఎమ్మెల్యే పలు సందేహాలకు వివరణ ఇచ్చారు. ‘నాకు తెల్లరేషన్ కార్డు ఉందని తెలియదు.. ఈ విషయం కుటుంబసభ్యులకు కూడా తెలియదు.. నేనే తెల్లరేషన్ కార్డుదారుడునైతే ప్రతి నెల నా రేషన్, ఇతర బిపిఎల్ సంక్షేమ పథకాలు ఏమవుతున్నాయి.. నాకు నెల నెల రేషన్ అందనప్పుడు దానిని ఎద్దుకు రద్దుచేయలేదు.. పాస్‌పోర్టు కోసం 2009లో రేషన్ కార్డు అవసరం వచ్చింది. ఈ క్రమంలో గులాబీ రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేశాను. 2010-11లో తెల్లకార్డు ఇచ్చారు.

అయితే దాన్ని రద్దు చేయాలని కోరాను.. తరువాత పట్టించుకోలేదు. అప్పటినుంచి రద్దు కాలేదట. దీనిపై పలాస, వజ్రపుకొత్తూరు తహసీల్దార్లతో మాట్లాడాను. 2014లోనే రద్దయిందని అన్నారు. అప్పట్లో రద్దయిన కార్డులు ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించామని చెబుతున్నారు. ప్రస్తుతం ఇచ్చిన బియ్యాన్ని వెనక్కి ఇస్తూ విచారించాలని అధికారులను కోరా’ అని అప్పలరాజు వివరించారు. ఎమ్మెల్యే అప్పలరాజు స్వగ్రామం పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ. అక్కడి ఆయన పేరుతో తెల్ల కార్డు ఉండగా, ప్రస్తుతం పలాసలో ఉంటున్నారు.

రేషన్‌కార్డుకు ఆధార్‌ మ్యాపింగ్‌ చేసిన ప్రకారం పలాసలో ఉంటున్న ఎమ్మెల్యేకు సరకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘వాలంటీర్లు చక్కగా పనిచేస్తున్నారు.. సరుకులను నేరుగా లబ్దిదారుల ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారు. రేషన్ ధరకు అయ్యే మొత్తమే తీసుకుంటున్నారని గానీ అంతకంటే ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోవడం లేదు. ఏదైనా సంక్షేమ పథకాలను అదే రోజున అందజేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది. గుమ్మం వద్దకే వచ్చి వారు సేవలందిస్తున్నారు. ఇదే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలోని పారదర్శకత అంటూ’ ఫేస్‌బుక్‌లో వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Kancheti sai sensational allegations on kodela siva prasad rao suicide

  కొడెల శివప్రసాద్ ఆత్మహత్యపై కంచేటి సాయి అరోపణలు

  Sep 16 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నా.. ఆయనది ఆత్మహత్యేనని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ద్వారా తేలిందని సమాచారం. అయితే రకరకాల ఊహాగానాలు... Read more

 • Ys jagan tweet on devipatnam boat capsize viral on net

  దేవీపట్నం ప్రమాదంపై అప్పటి జగన్ ట్వీట్ వైరల్..!

  Sep 16 | గోదావరిలో జరిగిన ఘోర దుర్ఘటన జరిగి, 12 మంది మృతి చెందగా, మరో 25 మందికి పైగా గల్లంతైన నేపథ్యంలో, ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు మరోసారి... Read more

 • Reason behind boat capsize in river godavari dozens still missing

  గోదావరి నదిలో లాంచీ ప్రమాదానికి కారణం అదేనా.?

  Sep 16 | పాపికొండలు విహార యాత్రలో విషాదం చోటు చేసుకున్న ఘటనలో విస్మయకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. గోదావరి నదిలో 5 లక్షల క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం ఉన్నప్పటికీ.. పర్యాటకుల బోటుకు ఎలా అనుమతి ఇచ్చారనే... Read more

 • Ap bjp president kanna laxminarayana taken into custody

  కన్నాను అడ్డుకున్న పోలీసులు.. సభకు అనుమతి నిరాకరణ

  Sep 16 | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సత్తెనపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు. గురజాలలో బహిరంగ సభను నిర్వహించడానికి బీజేపీ ప్రయత్నించగా ఆ సభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.... Read more

 • Kodela siva prasad rao suicide attempt agianst vendetta politics

  పరమపదించిన పల్నాటి పులి..కొడెల శివప్రసాద్..

  Sep 16 | ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన బసవతారకం... Read more

Today on Telugu Wishesh