దేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడి గత ఏడాదిన్నర కాలం ఆర్థిక వ్యవస్థను అల్లాడిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దిగజారిన ఆర్థిక పరిస్థితికి ఇది నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని చెప్పారు. వాహనాలు కొనేవారు లేక ఆటోమొబైల్ రంగం కుదేలైపోయిందని అన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో అందరూ అర్థం చేసుకోవాలని కోరారు.
దేశంలో స్థూల ఆర్థిక విధానాలను కేంద్ర ప్రభుత్వమే శాసిస్తుందని... కేంద్రం తీసుకొచ్చిన విధానాలను రాష్ట్రాలు అనుసరించడం మినహా మరో గత్యంతరం లేదని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి తెలంగాణ రాష్ట్రం కూడా అతీతం కాదని చెప్పారు. దేశ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారుతున్న తరుణంలో... 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి రావడం పట్ల తాను చింతిస్తున్నానని తెలిపారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా బడ్జెట్ ను రూపొందించాల్సి వచ్చిందని చెప్పారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్థికశాస్త్ర మేధావుల సలహాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు మేధోమధనం చేసి బడ్జెట్ ను రూపొందించామని తెలిపారు. రూ. 1,46,492.30 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,11,055.84 కోట్లు కాగా, మూలధన వ్యయం వ్యయం రూ. 17,274.67 కోట్లు. బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు రూ. 2,044.08 కోట్లుగా చూపించారు.
బడ్జెట్‌లో ఆర్థిక లోటును 24,081 కోట్లుగా పేర్కొన్నారు. ప్రతి నెల గ్రామ పంచాయతీలకు రూ. 339 కోట్లు కేటాయించనున్నట్టు సీఎం కేసీఆర్ బడ్జెట్‌లో ప్రకటించారు. రైతు బంధు కోసం రూ. 12,000 కోట్లు కేటాయించారు. పంట రుణాల మాఫీ కోసం రూ. 6,000 కోట్లు కేటాయించినట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతు బీమా ప్రీమియం చెల్లింపు కోసం రూ. 1,137 కోట్లు కేటాయించారు. ఆసరా పెన్షన్లు కోసం రూ. 9402 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందిన నిధులు రూ. 31,802 కోట్లు అని సీఎం కేసీఆర్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. కేంద్రం నుంచి అదనంగా ఒక్క రూపాయి అందలేదని అన్నారు. విద్యుత్ సబ్సిడీ కోసం బడ్జెట్‌లో రూ. 8,000 కోట్లు కేటాయించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ. 1, 764 కోట్లు కేటాయించారు. ఆరోగ్య శ్రీకి రూ. 1336 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయం తగ్గినా పరిస్థితి మెరుగ్గానే ఉందని కేసీఆర్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more