KCR Pictures Are Engraved to Yadadri Temple Pillars యాదాద్రి ఆలయ స్థంబాలపై కేసీఆర్ చిత్రాలు.!

Cm kcr pictures are engraved to yadadri temple pillars

KCR pictures engraved to Yadadri temple pillars, CM pictures engraved to Yadadri temple pillars, TRS chief pictures engraved to Yadadri temple pillars, yadadri, KCR pictures, yadadri temple, trs party, temple pillar design, telangana tirupati, cm kcr, telangana, politics

CM KCR pictures are engraved to rennovated Yadadri temple pillars as it is being developed as Telangana Tirupati.

ITEMVIDEOS: ప్రజాధనంతో ప్రచారం.. యాదాద్రి ఆలయ స్థంబాలపై కేసీఆర్ చిత్రాలు.!

Posted: 09/06/2019 12:04 PM IST
Cm kcr pictures are engraved to yadadri temple pillars

తెలంగాణవాసులు పరమపవిత్రంగా ఆరాధించే యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మహిమాన్వితమైనదన్న విషయం తెలిసిందే. లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభువుగా వెలిసిన పుణ్యక్షేత్రమిది. భక్తులు ప్రగాడ విశ్వాసాలతో, స్థలానికి వున్న విశిష్టతతో అభివృద్దికి అమడ దూరంలో వున్నా.. భక్తులు మాత్రం నిత్యం యాదగిరీశుడిని దర్శనానికి బారులు తీరుతుంటారు. ఇంతటి మహిమాన్విత స్వయంబు దేవాలయం కావడంతో ఈ ఆలయాన్ని పునర్మించి.. విశాలంగా మలిచేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నడుంచుట్టారు.

తెలంగాణ రాష్ట్ర వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ఆలయానికి తిరుమల వున్నట్టుగానే యాదగిరిగుట్టను కూడా తెలంగాణ తిరుపతిలా మలిచే పనిలో పడ్డారు సీఎం కేసీఆర్. వెయ్యి కోట్ల రూపాయల నిధులతో యాదాద్రి ఆలయాన్ని అంగరంగవైభవంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ ఆలయానికి విచ్చేసి భక్తుల కోసం.. హైదరాబాద్ నగరం నుంచి త్వరితగతిన చేరుకునేలా.. ప్రత్యేకంగా మెట్రో రైలు సదుపాయంపై కూడా యోచిస్తున్నారు. ప్రస్తుతం ఆలయ పునరుద్దరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే తాజాగా ఇక్కడ వెలుగు చూసిన ఓ అంశం మాత్రం ఇంత చేస్తున్న ముఖ్యమంత్రిని విమర్శలపాలు చేస్తోంది.

అదేంటంటే.. సీఎం కేసీఆర్ చిత్రాలు ఆలయ రాతి శిలలపై చెక్కడమే. సర్లే.. ఆలయ పునర్నిర్మాణం చేపట్టిన ఆయన తన చిత్రాలు చెక్కించుకున్నారంటే.. పర్వాలేదు. కానీ దేవాలయాల్లోకి రాజకీయాలను తీసుకురాకూడదన్న విషయాన్ని కూడా మర్చి.. తెలంగాణ రాష్ట్ర సమితీ అయిన తన రాజకీయ పార్టీ గుర్తు కారు చిహ్నంతో పాటు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కేసీఆర్ కిట్, హరితహారాలను కూడా ఇదే స్థంబాలపై చెక్కించడం పలు విమర్శలకు తావిస్తోంది. వీటితో పాటు జాతీయ పక్షి పక్షి నెమలి, రాష్ట్ర జంతువు కృష్ణ జింక తదితరాలను కూడా శిల్పాలపై పోందుపర్చారు.

kcr on yadadri temple pillars
ఈ రాతి స్తంభాలను అష్టభుజి ప్రాకార మండపంలో నిక్షిప్తం చేయనున్నారు. మరో వెయ్యేళ్ల పాటు కేసీఆర్ ప్రజలకు గుర్తుండేలా చూసేందుకే 'సారు-కారు... సర్కారు పథకాలు'ను స్తంభాలపై చెక్కినట్టు తెలుస్తోంది. వీటితో పాటు తెలంగాణ చరిత్రను, సంస్కృతిని తెలియజేసేలా ఆనాటి చిహ్నాలు, బొమ్మలు, ప్రజల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా బొమ్మలనూ స్తంభాలపై చెక్కారు. ప్రత్యేకంగా తెప్పించిన కృష్ణ శిలలపై ఆధ్యాత్మిక, పురాణ, ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలనూ చెక్కారు. ఇవన్నీ ఆలయంలో శాశ్వతంగా అమరిపోనున్నాయి. ప్రస్తుతం చలామణిలో లేని ఒక పైసా, రెండు పైసలు, అణా, అర్ధణా బొమ్మలు కూడా వీటిపై ఉన్నాయి.

కాగా సారు-కారు-సర్కారు పథకాలతో పాటు కేసీఆర్ చిత్రాలను కూడా యాదాద్రి దేవాలయంలోని స్థంబాలపై చెక్కిచడం విమర్శలకు దారితీస్తోంది. సర్వజనులకు సూక్తలను చెప్పే కేసీఆర్.. దేవాలయంలోకి రాజకీయాలను తీసుకురాకూడదన్న ఇంకితాన్ని మర్చి.. తన ప్రభుత్వ పథకాలను ఆలయ స్థంబాలపై ఎలా చెక్కించారని పలువురు విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాధనంతో దేవాలయ పునర్నిర్మాణ పనులను చేపట్టిన కేసీఆర్.. తన ప్రభుత్వ ప్రచారానికి వినియోగించుకోవడం పట్ల కూడా విమర్శలు వెల్లివిరుస్తున్నాయి. ఇక మరికోందరైతే.. రాబోయే రోజుల్లో కేసీఆర్, ఆయన పార్టీ గోడలకు మాత్రమే పరిమితం అవుతుందని ఆయనే సింబాలిక్ గా చెప్పుకుంటున్నారని వ్యంగ వ్యాఖ్యానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles