Auto driver in Gurugram fined Rs 32500 for traffic violations స్కూటీ విలువ రూ.15వేలు.. జరిమానాలు రూ.23వేలు

Delhi man fined rs 23k for violating traffic rules with his bike worth rs 15k

Traffic Rules, Motor Vehicles Amendment Act, Dinesh Madan, traffic cops, Scooty, Motor Vehicles Act, Driving Licence, WhatsApp, Crime news

A Delhi man has been fined a whopping ₹23,000 here for riding a bike without wearing a helmet. Traffic police challaned of ₹23,000 and seized his vehicle. Value of my Scooty is around ₹15,000. He even got a copy of RC on WhatsApp from home but by then the challan had been printed.

స్కూటీ విలువ రూ.15వేలు.. జరిమానాలు రూ.23వేలు

Posted: 09/04/2019 11:59 AM IST
Delhi man fined rs 23k for violating traffic rules with his bike worth rs 15k

కొత్త వాహన చట్టంపై సోషల్ మీడియా వేదికగా ఎన్ని విమర్శలు వస్తున్నా.. అటు కేంద్రం, ఇటు ట్రాఫిక్ పోలీసులు మాత్రం తమ దారి సపరేటు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. వాహనచట్టం నిబంధనలను అతిక్రమించిన వారికి భారీగా జరిమానాలు విధించేందుకు రెడీ అవుతున్న ప్రభుత్వాలు.. వాహనాలకు అనుగూణంగా చేపట్టాల్సిన చర్యలకు మాత్రం మంగళం పాడుతున్నారు. రోడ్ల విస్తరణ, చినుకు పడితే చిత్తడయ్యే రోడ్లు.. గొతులమయమైన రోడ్లు.. ఇలా అనేక సమస్యలు తిష్టవేసినా.. వాహనదారులు మాత్రం క్రమం తప్పకుండా రోడ్ టాక్స్ లు చెల్లిందాలి.

ఇక తాజాగా సవరించిన వాహన చట్టం మేరకు విధిస్తున్న భారీ జరిమానాలు వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వేల కోట్ల రూపాయలను తృణప్రాయంలా ఖర్చుపెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వ్యాపారధోరణితో వ్యవహరించి.. ప్రజల కష్టార్జితాన్ని దోచుకునేందుకు కొత్త పథకాలు వేస్తున్నాయన్ని కూడా నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. తాంబులాలిచ్చాం తన్నుకుచావండీ అన్నట్లుగా ఫ్రీ లెఫ్ట్ టార్నింగ్ ల పేరుతో ట్రాఫిక్ పోలీసులకు పనిలేకుండా పోయింది. ఇక వారు ఫోటోగ్రాఫర్ల అవతారమెత్తారు. ఇక ఫ్రి లెఫ్ట్ చోట అటు నుంచి వచ్చే వాహనాలు, ఇటు నుంచి వెళ్లే వాహనాలు ఎటు వెళ్తున్నాయో తెలియక తికమకపడుతూ వాహనదారులు ప్రమాదాలను ఎదుర్కోంటున్నారు.

తాజాగా సవరించిన వాహనచట్టం అమల్లోకి రావడంతో.. గురుగ్రామ్‌లో ఓ స్కూటర్ యజమానికి ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.23 వేల జరిమానా విధించారు. హెల్మెట్ లేదని అతడ్ని అపిన ట్రాఫిక్ పోలీసులు అతడ్ని నుంచి వాహనానికి సంబంధించిన పత్రాలు ఏమీ లేవని తెలిసి.. ఏకంగా 23 వేల రూపాయల జరిమానా విధించారు. ఇంత జరిమానా.? అవును. వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తన వద్ద పెట్టుకోకపోవడమే ఆ వాహనదారుడు చేసిన తప్పు. దినేశ్ మదన్ అనే వ్యక్తి హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడుపుతుండడంతో ఆపిన పోలీసులు మిగతా డాక్యుమెంట్లు చూపించాలని కోరగా అవి కూడా లేకపోవడంతో భారీ జరిమానా విధించారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపినందుకు రూ.5 వేలు, రిజిస్ట్రేషన్ పత్రాలు లేనందుకు రూ.5 వేలు, ఇన్సూరెన్స్ లేనందుకు రూ.2 వేలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేనందుకు రూ.10 వేలు, హెల్మెట్ లేకుండా నడిపినందుకు రూ.1,000 కలిపి మొత్తం రూ.23 వేల జరిమానా విధించడంతో మదన్ విస్తుపోయాడు. తన స్కూటీ రూ.15 వేల ఖరీదు కూడా చేయదని, కానీ రూ. 23 వేల జరిమానా విధించారని వాపోయాడు. ఇక మరో కేసులో అదే గురుగావ్ లోని సికిందర్ పూర్ ప్రాంతానికి చెందిన అటో డ్రైవర్ ట్రాఫిక్ సిగ్నల్ దాటాడని అతనికి 32,500 రూపాయల జరిమానా విధించారు పోలీసులు. తస్మాత్ జాగ్రత్తా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Traffic Rules  Dinesh Madan  traffic cops  Scooty  MVI Amendment Act  Driving Licence  WhatsApp  Crime news  

Other Articles