జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ రద్దు చేసిన నేపథ్యంలో ప్రపంచం ముందు దోషిగా నిలబడిన దాయాధి పాకిస్థాన్.. ఓ వైపు సరిహద్దు ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పోడుస్తూనే వుంది. అది చాలదన్నట్లు భారత్ లోకి అక్రమంగా ఉగ్రవాదుల చోరబాటును కూడా ప్రోత్సహిస్తోంది. ఇక ఆర్టికల్ 370 రద్దు తరువాత తమకు ప్రపంచ దేశాలను నుంచి సహకారం రాకపోయినా.. భారత్ పై మాత్రం ఎప్పటికప్పుడు విషాన్ని చిమ్ముతుంది.
ఓ వైపు తమ మంత్రులతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్న పాకిస్తాన్.. మరోవైపు అక్టోబర్ లేదా నవంబర్ లో యుద్దం కూడా జరగొచ్చని కవ్వింపు వ్యాఖ్యలు చేయిస్తోంది. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ సంయమనంతోనే వ్యవహరిస్తోంది. ఇక తాజాగా మన సహానాన్ని దాయాధి చేతకాని తనంలా భావిస్తోందా.? అంటే ఔననక తప్పదు. ఎందుకంటే పాకిస్తాన్ మరో దుందుడుకు చర్యకు పాల్పడింది. ఉపరితలం నుంచి ఉపరితలాన్ని గురిపెట్టే అణ్వాయుధ క్షిపణి ‘ఘాజ్నవి’ని ప్రయోగించింది.
గురువారం తెల్లవారు జామున ఈ పరీక్షను నిర్వహించినట్లు పాకిస్తాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఇది ఛేదించగలదని వెల్లడించారు. పరీక్ష విజయవంతమైందని, పాక్ అధ్యక్షుడు, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా ఆర్మీని అభినందించారని ఆయన పేర్కొన్నారు. పరీక్షకు సంబంధించిన 30 సెకన్ల వీడియోను కూడా జత చేశారు.
Pakistan successfully carried out night training launch of surface to surface ballistic missile Ghaznavi, capable of delivering multiple types of warheads upto 290 KMs. CJCSC & Services Chiefs congrat team. President & PM conveyed appreciation to team & congrats to the nation. pic.twitter.com/hmoUKRPWev
— DG ISPR (@OfficialDGISPR) August 29, 2019
(And get your daily news straight to your inbox)
Jul 01 | రాష్ట్రంలో ఆన్లైన్ సినిమా టికెట్ల విధానం అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ సర్కారుకు చుక్కెదురైంది. జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 69పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం... Read more
Jul 01 | ఐబిపిఎస్ (IBPS) క్లర్క్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 6035 క్లర్క్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి... Read more
Jul 01 | తన కారు డ్రైవర్ హత్యాభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను న్యాయస్థానం మరోమారు పొడిగించింది. గత మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు రిమాండ్ గడువు నేటితో... Read more
Jul 01 | మారుతున్న పనివేళలు, ఉద్యోగ కల్పన ఇత్యాదుల నేపథ్యంలో నూతన కార్మిక చట్టాలను తీసుకురావాలని కేంద్రప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 1 నుంచి ఈకొత్త కార్మికచట్టాలను అమలుపర్చాలని చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది.... Read more
Jul 01 | మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగిసి.. శివసేన రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ న్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నావిస్ ఢిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ తరుణంలో.. ప్రజలకు... Read more