Police gear up to implement new MVI Act కొత్త MVI చట్టం: నాలుగేళ్లు దాటితే చిన్నారులకూ హెల్మెట్.!

Police gear up to implement new mvi act in india

New MVI Act, Amendments in MVI Act, Helmet compulsory for pillon drivers, Hyderabad, Warangal, Vijayawada, Vishakapatnam, Heavy Fines, CC cameras, Fine increased Motor Vehicle Act, New MVI Act, Heavy Fines, Jail sentence, Traffic rules violations, Traffic police, police, motor vehicle actm CC cameras, India, Crime

After receiving government orders, police officials are all set to implement rules pertaining to the Motor Vehicles Act 2019(MV Act). Besides inclusion of several do’s and don’ts in the law, the new rules are expected to be stringent and the penalty charged will be heavier.

కొత్త వాహన చట్టంతో జరభద్రం.. నాలుగేళ్లు దాటితే చిన్నారులకూ హెల్మెట్.!

Posted: 08/29/2019 03:01 PM IST
Police gear up to implement new mvi act in india

వాహనదారుల్లో కొత్త వాహన చట్టం గుబులు పుట్టిస్తోంది. వచ్చే నెల ఒకటి నుంచి గీత దాటితే వేటు తప్పేలా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాల్లో ఏర్పటు చేసిన కెమెరాలతో నిత్యం వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టనున్నారు. మోటారు వాహనాల సవరణ చట్టం-2019లోని 28 నిబంధనలు ఒకటో తేదీ నుంచి అమలు కానున్న నేపథ్యంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మిగతా నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించనున్న ప్రభుత్వం పిల్లల విషయంలోనూ అంతే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.

ఇకపై, బైక్‌పై తల్లిదండ్రులతో కలిసి వెళ్లే నాలుగేళ్ల చిన్నారులు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందేనని సవరణ చట్టం చెబుతోంది. లేదంటే భారీ జరిమానా తప్పదు. ఇక, ఇప్పటి వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలకు వందల్లో ఉన్న జరిమానా మరో మూడు రోజుల తర్వాత వేలల్లోకి మారుతుంది. అంతేకాదు, దీనికి జైలు శిక్ష అదనం. సామర్థ్యానికి మించిన లోడుతో వెళ్తే రూ.20 వేల వరకు జరిమానాతోపాటు అదనంగా ఉండే ప్రతీ టన్నుకు మరో రూ.2 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

అయితే జరిమానా కట్టేసాం కదా.. ఇక ఇలాగే వెళ్లొచ్చులే అనుకుంటూ అక్కడే ట్రాఫిక్ లో జామ్ అయినట్టే.  ఎందుకంటే జరిమానా చెల్లించినా, అదనపు బరువును అక్కడికక్కడే తగ్గించాల్సి ఉంటుంది. అలాగే, ప్రయాణికుల వాహనాల విషయంలోనూ నిబంధనలు ఉల్లంఘిస్తే జేబులు గుల్ల చేసుకోకతప్పదు. నిర్ణీత సంఖ్యకు మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే ఒక్కో ప్రయాణికుడిపై రూ.200 చొప్పున వసూలు చేస్తారు. సీటు బెల్టు ధరించకుంటే వెయ్యి రూపాయలు చెల్లించుకోక తప్పదు. సో.. వాహనదారుల్లారా.. తస్మాత్ జాగ్రత్త!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles