Balayya son in law fires on Minister Botsa బొత్స సత్యానారాయణపై బాలయ్య చిన్నల్లుడు ఫైర్

Mla balakrishna younger son in law fires on minister botsa satyanarayana

botsa reveals sujana asset details, sujana company holds 110 acres of land at amaravati, chandrababu relative allocated 500 acres land near to amaravati, sujana choudary, botsa satyanarayana, amaravati, inside trading, shifting of capital, Andhra Pradesh, Politics

TDP MLA and cine hero Nandamuri Balakrishna younger son in law Sri Bharath fires on Minister Botsa satyanarayana as he reveals assets details of his company.

బొత్స సత్యానారాయణపై బాలయ్య చిన్నల్లుడు ఫైర్

Posted: 08/28/2019 05:53 PM IST
Mla balakrishna younger son in law fires on minister botsa satyanarayana

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. అందుకనే ఇక్కడి నుంచి రాజధానిని తరలించే విషయమై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతుందని రాష్ట్ర మంత్రి బొత్సా సత్యనారాయణ రగిల్చిన నిప్పు రాజుకుంది. అందుకు తన వద్ద ఆధారాలు కూడా వున్నాయని చెప్పిన ఆయన బీజేపి ఎంపీ సుజనా చౌదరి బంధువులకు చెందిన 124 ఏకరాల భూముల వివరాలతో పాటు బాలకృష్ణ చిన్నల్లుడి చెందిన కంపెనీకి కూడా 500 ఏకరాల భూమిని ధారాదత్తం చేశారని ఆరోపించిన విషయం తెలిసిందే.

ఇక రాజధాని ప్రాంతం అమరావతి ఏర్పడిన తరువాత సీఆర్డీఏ ప్రాంతంలోకి దానిని కలిపారని బొత్స చేసిన ఆరోపణలపై బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ మండిపడ్డారు. మంత్రి బోత్స సత్యనారాయణ చేసిన అరోపణలు పూర్తిగా సత్యదూరమని ప్రకటించారు. రాజధాని అమరావతిపై బురద చల్లడానికి తనను వాడుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఆరోపణలు చేస్తే ఊరుకున్నానని... ఎన్నికల తర్వాత కూడా తనపై బురద చల్లడం సరికాదని అన్నారు. అమరావతికి 120 కిలోమీటర్ల దూరంలో గత ముఖ్యమంత్రి వియ్యంకుడికి స్థలాన్ని ధారాదత్తం చేశారని బొత్స ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో శ్రీభరత్ మీడియాతో మాట్లాడుతూ, స్థలం ధారాదత్తం చేశారని బొత్స అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. 2007లో కృష్ణా జిల్లా జయంతిపురంలో గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్ కోసం 498.39 ఎకరాలను తీసుకున్నామని తెలిపారు. బొత్స చూపించిన జీవో 2012 నాటిదని చెప్పారు. అప్పటికి తన వివాహం కూడా జరగలేదని... పెళ్లికి ముందు జరిగిన ఆ వ్యవహారాన్ని... తర్వాత జరిగిన పరిణామాలకు ముడిపెడుతున్నారని విమర్శించారు. తనను టార్గెట్ చేసి, వేలాది మంది రైతులకు అన్యాయం చేయవద్దని కోరారు.

దీనికి బదులుగా మళ్లీ మీడియా ముందుకు వచ్చిన బొత్సా.. ఆధారాలతో పాటుగా సుజనా కుటుంబానికి చెందిన ఆస్తుల చిట్టాను బయటపెట్టాడు. అయితే అన్ని ఇలా మీడియా ఎదుల బయట పెట్టడం బావ్యం కాదన్న ఆయన మచ్చుకు కొన్ని ఆస్తుల వివరాలను మీడియా సాక్షిగా ప్రకటించి.. బీజేపి నేతకు షాక్ ఇచ్చారు. ఒక్క సెంటు భూమి ఉందని నిరూపించాలన్న ఆయన సవాల్ ను చేతల ద్వారానే స్వీకరించిన బొత్సా ఏకంగా 124 ఏకరాల భూమికి సంబంధించిన రాజధాని భూముల వివరాలను బయటపెట్టారు. అంతేకాదు గత అధికార పార్టీ చేసిన కారుచౌకగా కట్టబెట్టిన భూముల వివరాలను కూడా వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles