Sheikh Rashid 'forecasts' Indo-Pak war in October భారత్ తో యుద్దం: పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Sheikh rashid predicts full blown pakistan india war in october november

Pakistan, Sheikh Rashid Ahmed, India, Rawalpindi, Jammu and Kashmir, Narendra Modi, United Nations Security Council, UNSC, Muharram, Muhammad Ali Jinnah, Imran Khan, United Nations, China

Pakistan's Federal Minister for Railways Sheikh Rashid Ahmed has predicted a full-blown war between Pakistan and India in the months of October and November.

అక్టోబర్ ఆపై నెలలో భారత్ తో యుద్దం: పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Posted: 08/28/2019 06:07 PM IST
Sheikh rashid predicts full blown pakistan india war in october november

పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు తర్వాత భారత్‌తో యుద్ధం జరిగే అవకాశముందని జోస్యం చెప్పారు. పాక్ రైల్వే మంత్రి వ్యాఖ్యలను అక్కడి మీడియా ప్రసారం చేసినట్లు జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. కార్గిల్ యుద్దం నేపథ్యంలో భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తిన్న దాయాధికి ఇంకా బుద్దిరాలేదు. కేవలం సీమాందర ఉగ్రవాదం బలుపు చూసుకుని విర్రవీగుతున్న పాకిస్తాన్ భూభాగంలోకి చోచ్చుకెళ్లి సర్జికల్ దాడులు చేసి భారత సైన్యం సత్తా చాటినా.. ఇంకా తమ వద్ద ఏదో వుందని డాంబికాలకు పోతోంది.

డెబై ఏళ్లుగా శాంతి, సహనంతో వున్న భారత్.. వూల్వామా దాడులను తిప్పికొట్టేందుకు పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై గగనతలం నుంచి దాడులు జరిపి.. వందల సంఖ్యలో ఉగ్రవాదుల్ని బలితీసుకున్నా.. ఇంకా తమదే పైచేయి అన్నట్లు వ్యవహరిస్తోంది. భారత్ పై మరోమారు కయ్యానికి కాలుదువ్వేలా కవ్వింపు వ్యాఖ్యలు చేస్తోంది. ఇటీవల లండన్ లో తమ దేశానికి చెందిన ప్రత్యర్థి రాజకీయ నేతలను విమర్శలు చేసిన క్రమంలో జరిగిన పరాభవం సరిపోని ఈ అమాత్యులు.. కావాలనే భారత్ పై వ్యాఖ్యలు చేసి తన అవామీ ముస్లిం లీగ్ పార్టీ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు భారతీయుల్లో కలుగుతున్నాయి.

అంతకుముందు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆర్టికల్ 370ని భారత్ చట్టవిరుద్ధంగా తొలగించిందని..కశ్మీరీల హక్కుల కోసం ఎంత వరకైనా వెళ్తామని అన్నారు. అంతేకాదు ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్థ మేఘాలు కమ్ముకున్నాయని..అన్నింటికీ తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ఇలా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు కేంద్రమంత్రులు సైతం నిత్యం భారత్‌ను రెచ్చగొడుతున్నారు. మరి పాక్ వ్యాఖ్యలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sheikh rashid ahmed  Jammu and Kashmir  Narendra Modi  India  Pakistan  United Nations  

Other Articles