SC Issues Notice to Centre over Scrapping of Article 370 కేంద్రానికి ‘సుప్రీం’ షాక్.. ఆర్టికల్ 370పై నోటీసులు

Supreme court issues notice to centre over scrapping of article 370

Supreme Court, Ranjan Gogoi, Constitution of India, Article 370, abrogate article 370, pleas, Article 35A, Chief Justice, Ranjan Gogoi, SC

The Supreme Court has issued a notice to the Centre asking it to respond to 14 petitions on scrapping of Article 370 in Jammu and Kashmir. The apex Court has referred the matter to a five-judge Constitution bench and it will hear all pleas related, in the first week of October.

ప్రధాని మోడీ ప్రభుత్వానికి ‘సుప్రీం’ షాక్.. ఆర్టికల్ 370పై నోటీసులు

Posted: 08/28/2019 03:13 PM IST
Supreme court issues notice to centre over scrapping of article 370

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై దాఖలైన పిటీషన్లను విచారణకు స్వీకరించింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంతో పాటు జమ్మూకాశ్మీర్ ప్రాంతాన్ని ఢిల్లీ తరహాలో చట్టసభ వున్న యూనియన్ టెరిటరీగా చేయడంతో పాటు లడఖ్ ప్రాంతాన్ని అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చివేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జమ్మూకాశ్మీర్ సహా లడఖ్ ప్రాంతంలో పోలీసులు, భద్రతా దళాల బందోబస్తులోనే వుంది.

అయితే ఈ విషయంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రజలు, నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని విమర్శలు రేగాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తులు ఉన్న బెంచ్‌కి ఈ కేసును బదిలీ చేసింది. ఆర్టికల్ 370 రద్దు పట్ల మోదీ సర్కారుకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు.

ఏం చేయాలో తమకు తెలుసని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. అడ్వొకేట్ ఎంఎల్ శర్మ తొలి పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత జమ్మూ కశ్మీర్‌కు చెందిన లాయర్ షకీబ్ షబీర్ ఆయనకు జత కలిశారు. ఆగష్టు 10న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా పిటీషన్ దాఖలు చేసింది. ఇవే కాకుండా చాలా మంది ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ పిటీషన్లు దాఖలు చేశారు.

ఇప్పటి వరకూ జమ్మూ కశ్మీర్లో పర్యటించడానికి కేంద్రం రాజకీయ నేతలకు అనుమతించడం లేదనే సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రతిపక్ష నేతలతో కలిసి రాహుల్ శ్రీనగర్ వెళ్లగా.. విమానాశ్రయం నుంచే వారిని వెనక్కి పంపించారు. కాగా.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జమ్మూకాశ్మీర్‌లో పర్యటించేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ యూసఫ్ తరిగామీని కలిసేందుకు ఓకే చెప్పింది. కానీ ఈ పర్యటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Ranjan Gogoi  Constitution of India  Article 370  abrogate article 370  

Other Articles