Techie held for blackmailing women with nude photos ఉద్యోగ అవకాశం పేరుతో న్యూడ్ ఫోటోలు.. ఆఫై బ్లాక్ మెయిల్

Chennai based techie held for cyber bullying and blackmailing women

cyber stalker, Clement Raj Chezyian, nude photos, cyber bullying, luring young women, miyapur police, cyberabad police, blackmailing, Sexual harassment, hyderabad, Tamil Nadu, Crime

A 33-year-old techie from Chennai who impersonated himself as a recruiter and lured young women from different parts of the country to share their nude pictures with him, promising them jobs as front office executives, was arrested by Miyapur police Cyberabad commissionerate in the city.

ఉద్యోగ అవకాశం పేరుతో న్యూడ్ ఫోటోలు.. ఆఫై బ్లాక్ మెయిల్

Posted: 08/24/2019 10:52 AM IST
Chennai based techie held for cyber bullying and blackmailing women

ఉద్యోగావకాశాల కల్పన పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్న క్రమంలో కేవలం తనకు బోర్ కొడుతొందని ఓ సాఫ్ట్‌వేర్ టెక్కీ ఆడిన ఆటలో ఏకంగా 600 మంది అమ్మాయిలు చిక్కారు. సరదాగా ప్రారంభించిన పనికి ఆయనకు దేశంలోని వివిధ నగరాల నుంచి స్పందన లభించడంతో అతను కూడా మృగంగా మారాడు. ఆటలా ప్రారంభించిన నేరవిన్యాసంలో ఆయన ఆరితేరిపోయి.. ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు బదులు వారినే డబులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అప్పనంగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడు. ఈ పైశాచిక మృగం ఆటలను సైబరాబాద్ పోలీసులు కట్టించారు. కేసు విచారణలో నిందితుడు ఏకంగా 600 మందిని తన ఎరలో చిక్కకునేలా చేశాడని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన ప్రదీప్ (33)... ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇతనికి నిత్యం నైట్ జాబ్ వుండటం. అతని భార్య డే జాబ్ చేయడం వల్ల ఇంట్లో ఒంటిరిగా వుంటూ.. బోరింగ్ ఫీలయ్యేవాడు. అలాంటి వాడు పగలు మరేదో జాబ్ లేదా.. కాలక్షేపం కోసం ఏదో మార్గం ఎంచుకోకుండా.. ఆడవాళ్లు.. వాళ్లకు జాబులు అనే అంశాన్ని తీసుకుని వారిని సరదాగా ఆటపట్టించాలని అనుకున్నాడు. ఫేస్ బుక్ లో అర్చనా జగదీష్ పేరుతో ఓ అకౌంట్ తెరిచాడు. ఆమె ఓ కన్సల్టెన్సీ కంపెనీ హెచ్ఆర్ అని రాశాడు.

ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే... మెసేజ్ పంపమని చెప్పాడు. చాలా మంది అమ్మాయిలు, మహిళలు, యువతులు... తమకు ఉద్యోగం కావాలని మెసేజ్‌లు పంపేవాళ్లు. వాళ్ల ఫోన్ నంబర్ తెలుసుకొని... కాల్ చేశేవాడు. అర్చనా జగదీష్ తాలూకా అని చెప్పేవాడు. ఇంటర్వ్యూ చేస్తున్నానంటూ... మాయమాటలు మాట్లాడేవాడు. త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగం ఇప్పిస్తానని వాళ్లను నమ్మించేవాడు. అలా వాళ్లతో కనెక్ట్ అయ్యేవాడు.

ఒక్కసారి అమ్మాయిలు తనకు కనెక్ట్ అవ్వగానే... "ఫ్రంట్ ఆఫీస్, రిసెప్షనిస్ట్ జాబ్‌ చెయ్యాలంటే అందంగా ఉండాలనీ, మంచి ఫిజిక్ మెయింటేన్ చేస్తూ ఉండాలి" అని చెప్పేవాడు. "అలా ఉన్నవాళ్లకు మాత్రమే ఉద్యోగం ఇవ్వగలం" అని చెప్పి... "మీరు అలా ఉన్నారో లేదో నాకు తెలియాలి. కాబట్టి మీ నార్మల్ ఫొటోలు, న్యూడ్ ఫొటో పంపిస్తే... చెక్ చేసి... జాబ్‌కి సెలెక్ట్ చేస్తాం"... అనేవాడు... న్యూడ్ ఫొటో ఎందుకని అడిగితే... "ఆ ఫొటోను బట్టీ... ఫిజిక్ ఎలా పెంచుకోవాలో, ఏయే మార్పులు చేసుకోవాలో చెబుతాం" అని అనేవాడు. మంచి జీతం వస్తుందని ఆశ కలిగించాడు.

ఆ దుర్మార్గుడిని నమ్మి... దేశంలో 16 రాష్ట్రాలకు చెందిన... 600 మంది మహిళలు, యువతులు తమ న్యూడ్ పిక్స్ పంపినట్లు సైబరాబాద్, మియాపూర్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక్క హైదరాబాద్‌లోనే 60 మంది బాధితులు ఉన్నట్లు తేలింది. న్యూడ్ ఫొటోలు పంపిన అమ్మాయిలకు ఫోన్లు చేసి... డబ్బులు పంపాలనీ, లేదంటే ఆ ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టి... పరువు తీస్తానని బెదిరించేవాడు. ఈ బ్లాక్‌మెయిల్ ఉచ్చులో పడి చాలా మంది అమ్మాయిలు... అతనికి చాలా డబ్బులు సమర్పించుకున్నారు. హైదరాబాద్‌కి చెందిన ఓ వివాహిత (29)... అతని వేధింపులు తట్టుకోలేక... మియాపూర్ పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చింది. కేసు రాసిన పోలీసులు... కేటుగాణ్ని పట్టుకుని... కటకటాల వెనక్కి నెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cyber stalker  cyber bullying  cyberabad police  blackmailing  Sexual harassment  Tamil Nadu  Crime  

Other Articles

Today on Telugu Wishesh