Chidambaram Might Be Arrested at any time.? ఏ క్షణంలోనైనా మాజీ కేంద్రమంత్రి చిదంబరం అరెస్టు.?

Inx media scam chidambaram might be arrested at any time

Lookout notice issued against P Chidambaram, p chidambaram, lookout notice, karti chidambaram, cbi issues lookout notice against p chidambaram, p chidambaram inx media case, chidambaram, chidambaram inx media case, ed lookout notice on p chidambaram, cbi lookout notice on p chidambaram, look out notice, P Chidambaram, Supreme Court, INX Media Scam, Special Leave Petition, CJI, Justice NV Ramana

INX Media case: P Chidambaram is accused of facilitating foreign investment in a media company as Finance Minister in the Congress-led UPA government at the instance of his son Karti

ఏ క్షణంలోనైనా మాజీ కేంద్రమంత్రి చిదంబరం అరెస్టు.?

Posted: 08/21/2019 05:45 PM IST
Inx media scam chidambaram might be arrested at any time

ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మాజీ కేంద్రమంత్రి చిదంబరాన్ని ఏ క్షణంలోనైనా సీబిఐ, ఈడీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం వుందన్న వార్తలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆయనకు ఇవాళ భంగపాటు ఎదురైంది. ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసును అత్యవసరంగా పరిగణిస్తూ విచారించాల్సిన అవసరమేముందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

దీంతో సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించే అకాశం వుందా.? లేదా? అన్న ప్రశ్నలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాగా, దేశ అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈ కేసును తాను భారత ప్రధాన న్యాయమూర్తి తరుణ్ గొగోయ్ నిర్ణయం తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయోధ్య రామమందిరం కేసులోని వివిధ వర్గాల వాదనలు వింటూ బిజీగా వున్న నేపథ్యంలో ఈ స్పెషల్ లీవ్ ఫిటీషన్ ను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది.

మాజీ కేంద్రమంత్రి పిటీషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తి.. జస్టిస్ ఎన్వీ రమణ.. చిదంబరం ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణను అత్యవసరం కింద విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీంతో అక్కడ కూడా మాజీ విత్త మంత్రికి నిరాశే ఎదురైంది. అయితే డిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ధర్మాసనానికి పంపినట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. దీంతో పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలా.. వద్దా అనేది లంచ్‌ తర్వాత సీజేఐ నిర్ణయించనున్నారు.

ఇదిలా ఉండగా నిన్న హైకోర్టు బెయిల్‌ నిరాకరించడంతో ఐఎన్‌ఎక్స్‌-మీడియా కేసులో చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు సీబీఐ, ఈడీ రంగంలోకి దిగి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇవాళ ఈడీ మరోమారు తాజా లుక్ అవుట్ నోటీసులను మళ్లీ జారీ చేశాయి. 2007లో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు అనుమతించారనీ, ఇందుకు ప్రతిఫలంగా ముడుపులు అందుకున్నారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి.

అంతేకాకుండా విత్తమంత్రి హోధాలో ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని కూడా ఈడీ, సీబిఐలు అరోపిస్తున్నాయి. ఈ కుంభకోణాల్లో వచ్చిన డబ్బుతో ఆయన కుమారుడు కార్తీ చిదంబరం స్పెయిన్ లో ఓ టెన్నిస్ క్లబ్బును, యూకేలో కాటేజీలను, భారత్ తో పాటు ఇతర దేశాల్లో పలు ఆస్తులను కొన్నారని ఈడీ ఆరోపిస్తోంది. వీటి విలువ రూ. 54 కోట్లకు పైగా ఉంటుందని చెబుతోంది. ఈ కేసులో కార్తీతో పాటు చిదంబరం కూడా నిందితుడిగా ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్ సెల్-మ్యాక్సిస్ 2జీ కుంభకోణాలలో తండ్రి, కుమారుడిపై ఛార్జ్ షీట్లు నమోదయ్యాయి. ఇప్పటికే కొన్ని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దీంతో ఆయనను ఏ క్షణంలోనైనా సీబిఐ, ఈడీ అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న వార్తలు చక్కర్లు కోడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : P Chidambaram  Supreme Court  INX Media Scam  Special Leave Petition  CJI  Justice NV Ramana  

Other Articles