Trump offers to mediate 'explosive' Kashmir stand-off మధ్యవర్తిత్వానికి రెడీ అంటూ మళ్లీ మొదటికొచ్చిన ట్రంప్

Trump offers to mediate on complicated kashmir issue again

Donald Trump, Kashmir, America, United States, Hindus, Muslims, Narendra Modi, Imran Khan, India, Pakistan, kashmir issue, Kashmir controversy, Politics

US President Donald Trump again says he is ready to mediate in the longstanding Kashmir conflict betweem India and Pakistan.

మధ్యవర్తిత్వానికి రెడీ అంటూ మళ్లీ మొదటికొచ్చిన ట్రంప్

Posted: 08/21/2019 12:23 PM IST
Trump offers to mediate on complicated kashmir issue again

సుమారుగా నెల రోజుల క్రితం భారత-పాకిస్థాన్ దేశాల మధ్య అపరిష్కృత వివాదంగా వున్న కాశ్మీర్ సహా సరిహద్దు అంశాన్ని పరిష్కరించేందుకు తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీంతో భారత్ నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొన్నాక.. ఆయన మాట మార్చి.. అమెరికాలోని భారత రాయభారికి అగ్రరాజ్యం క్షమాపణలు కూడా తెలిపింది. అంతేకాదు కశ్మీర్ అంశం భారత్-పాక్ ల సమస్య అని, ఆ రెండు దేశాలే పరస్పరం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కూడా సూచించారు.

ఇంతవరకు బాగానే వున్నా.. తాజాగా ఆయన మళ్లీ మొదటికి వచ్చి.. కశ్మీర్ అంశం చాలా తీవ్రమైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశం తన మధ్యవర్తిత్వంతోనే పరిష్కారం అవుతందని అన్నారు. ఈ రెండు దేశాల మధ్య సమస్య శాశ్వత పరిష్కారానికి అగ్రరాజ్యం పెద్దన్న పాత్ర వహిస్తుందని చెప్పారు. ఈ రెండు దేశాల మధ్య నెలకోన్న సమస్యను ఆయన మతాల మధ్య సమస్యగా కూడా పేర్కోన్నారు. 'కశ్మీర్ ప్రాంతం చాలా సంక్లిష్టమైనది. మీకు హిందువులు ఉన్నారు. ముస్లింలు ఉన్నారు. అయితే రెండు వర్గాలు సంయమనంతో ఉన్నాయని తాను చెప్పలేనని అన్నారు.

రెండు దేశాలు చాలా కాలంగా కలసికట్టుగా ముందుకు సాగడం లేదనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. నేను మధ్యవర్తిత్వం వహిస్తే... వీలైనంతగా సమస్యను పరిష్కరిస్తా.' అని ట్రంప్ అన్నారు. పరిస్థితిని తాము మెరుగుపరచగలమని తాను భావిస్తున్నానని ట్రంప్ చెప్పారు. అయితే, ఇరు దేశాల మధ్య ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఉన్నాయని... ఇది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ఇరు దేశాల్లో మతం అనేది చాలా క్లిష్టమైన సమస్య అని చెప్పారు. మతం విషయంలో చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Kashmir  United States  Narendra Modi  Imran Khan  India  Pakistan  Politics  

Other Articles