Raj Tarun denies causing an accident! కారు ప్రమాదానికి గురైన హీరో రాజ్ తరుణ్

Close shave for hero raj tarun on outer ring road

Raj Tarun denies causing an accident!, Raj Tarun, Accident, Volvo Car, Dil Raju, Suresh Babu, Outer ring Road, Hyderabad, Crime news

Tollywood Hero Raj Tarun ran away from the accident scene after ramming his car (TS09EX1100) into a divider near Outer Ring Road in Hyderabad early this morning. However, Raj Tarun in a statement had denied of involving in road accident.

ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ప్రమాదానికి గురైన హీరో రాజ్ తరుణ్..

Posted: 08/20/2019 12:02 PM IST
Close shave for hero raj tarun on outer ring road

ఔటర్ రింగ్ రోడ్డ్ కారు ప్రమాదానికి గురైన ఘటనలో యువ హీరో రాజ్ తరణ్ ఎలా వున్నారని ఆయన అభిమానులు అందోళనకు గురవుతున్నారు. తొలుత ఈ ప్రమాదానికి గురైన కారులో ఉన్నది హీరో తరుణ్ అని వార్తలు వచ్చాయి. అయితే అందులో వున్నది తరుణ్ కాదని, మరో హీరో రాజ్ తరుణ్ అని పోలీసులు సిసి కెమెరాలను చూసి నిర్థారించారు. ప్రమాదం తరువాత స్వల్ప గాయాలతో బయటపడిన రాజ్ తరుణ్, పరుగెత్తుకుంటూ వెళ్లి మరో కారులో వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వివరించారని సమాచారం.

కారులో వున్నది రాజ్ తరుణ్ అని తేలడంతో అయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. యాక్సిడెంట్ తరువాత రాజ్ తరుణ్ ఎక్కడికి వెళ్లాడన్న విషయం ఇంకా తెలియరాలేదు. రాజ్ తరుణ్‌ తన వాల్వో కారు (టీఎస్ 09 ఈఎక్స్ 1100)లో హైదరాబాద్ కు వస్తున్న వేళ, అల్కాపూర్ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అయితే తాను కారు ప్రమాదానికి గురయ్యానన్న వార్తను హీరో రాజ్ తరున్ తోసిపుచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తన కారు ప్రమాదానికి గురికాలేదని, తన కారు తన ఇంట్లోనే భద్రంగా వుందని పేర్కోన్నారు. అయితే తన కారు ఇంట్లోను వుందని పేర్కోంటున్నా.. రోడ్డు ప్రమాదం తనతోనే జరిగిందా.? లేదా.? అన్న విషయాన్ని మాత్రం చెప్పకపోవడం కొసమెరుపు. ఇదిలావుండగా.. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నాడన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raj Tarun  Accident  Volvo Car  Dil Raju  Suresh Babu  Outer ring Road  Hyderabad  Crime  

Other Articles