Yeddyurappa inducts 17 MLAs in first cabinet expansion యడ్యూరప్ప క్యాబినెట్లో సింహభాగం లింగాయత్ లకే..

Bs yediyurappa finally has a cabinet lingayats get lion s share

Bengaluru,BJP,bjp cabinet expansion,BJP party meeting,BS Yeddyurappa,BS Yediyurappa,Congress JD(S),Congress-JD(S) combine,Congress-JD(S) rebels,Dakshin Kannada,karnataka bjp cabinet expansion,karnataka bjp leaders,Karnataka cabinet,Karnataka Cabinet expansion,Lingayat,Narendra Modi,south Karnataka,Vokkaliga

BS Yediyurappa's new cabinet appears to be a rather lopsided attempt to pacify core voter base, while also trying to make inroads into the uncharted territories of south Karnataka by rewarding leaders from around the area.

యడ్యూరప్ప క్యాబినెట్లో సింహభాగం లింగాయత్ లకే..

Posted: 08/20/2019 01:28 PM IST
Bs yediyurappa finally has a cabinet lingayats get lion s share

కర్ణాటకలో మూడు వారాల క్రితం కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా యడియూరప్ప కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే గత మూడు వారాలుగా ఆయన ఒక్కరే అన్ని శాఖల పనితీరును చూసుకున్నారు. కాగా ఇవాళ ఈ లింగాయత్ వర్గానికి చెందిన నాయకుడ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణను చేపట్టింది. తన మంత్రివర్గంలో ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేతో పాటు మొత్తంగా 17 మందికి తన క్యాబినెట్ లో చేర్చుకున్నారు.  

స్వతంత్ర్య అభ్యర్థిగా గెలిచిన హెచ్.నగేశ్ సహా 17 మంది కేబినెట్ మంత్రులుగా ఇవాళ రాజ్ భవన్ లో మంత్రులుగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బి.శ్రీరాములు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలావుండగా, కర్ణాటకలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గంలో అత్యధికులు లింగాయత్ కులస్తులే వుండటం గమనార్హం. సుమారుగా 21 రోజుల పాటు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేసిన యడ్యూరప్ప తన కులస్థులకే సింహభాగం పదవులు కేటాయించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

బెంగళూరులోని రాజ్ భవన్ లో వీరందరి చేత గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఆర్. అశోక, జగదీశ్ షెట్టార్, మక్తప్ప కరజోల్, డాక్టర్ అశ్వర్థ్ నారాయణ్, కేఎస్ ఈశ్వరప్ప, లక్ష్మణ్ సంగప్ప సవడి, సీటీ రవి, ఎస్. సురేశ్ కుమార్, వి.సోమన్న, కోట శ్రీనివాస్ పూజారి, బసవరాజ్ బొమ్మై, ప్రభు చౌహాన్, జేసీ మధుస్వామి, చంద్రకాంత గౌడ, జె. శశికళ ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp  bs yeddyurappa  congress  janata dal secular  cabinet expansion  lingayaths  karnataka  politics  

Other Articles