IPS officer booked for kicking pregnant lady గర్భిణిని తన్నిన మహిళా ఎస్పీపై క్రిమినల్ కేసు..

Ips officer booked for kicking pregnant lady who suffered miscarriage

case against IPS Officer, case against female ips officer saumya mishra, Priya Dey, soumya mishra, IPS officer, pregnant woman, miscarriage, local court, Bhubaneswar, odisha, Crime news

A local court in Odisha has asked the police to book IPS officer Saumya Mishra for allegedly kicking a pregnant woman, which led to her miscarriage.

కోర్టు అదేశాలతో.. గర్భిణిని తన్నిన మహిళా ఎస్పీపై క్రిమినల్ కేసు..

Posted: 08/19/2019 11:49 AM IST
Ips officer booked for kicking pregnant lady who suffered miscarriage

పోలీసులకు నిందితులను అదుపులోకి తీసుకుని వారిని న్యాయస్థానంలో హాజరుపర్చాల్సిన బాధ్యత వున్నా.. దానిని అధిగమించి వారు పరారీలో వున్న నిందితుల అచూకీ కనుక్కునే సమయంలో నిందితుల సంబంధికులపై చేయి చేసుకోవడం, వారిని అకారణంగా ఠాణాలకు తీసుకెళ్లి నిర్భందంలో వుంచడం వంటి చర్యలు చేస్తారన్న అరోపణలు వున్నాయి. ఇలాంటి ఘటనలు ఏ కిందిస్థాయి అధికారులో చేశారంటే వారికి ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి తీవ్రంగా వుందని భావించవచ్చు.

కానీ ఓ జిల్లాస్థాయి అధికారినే ఇలాంటి దారుణాలకు పాల్పడితే.. తానే చట్టమన్నట్లు వ్యవహరిస్తే.. అది పరాకాష్టే. ఇక ఒడిషాలో అలాంటి ఘటనే జరిగింది. ఓ రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడైన వ్యక్తి ఆచూకీ చెప్పాలంటూ జిల్లా ఎస్పీ విచక్షణ రహితంగా వ్యవహరించారు. నిందితుడి భార్యను గర్భిణి అని కూడా చూడకుండా అమె పోట్టపై బూటు కాలితో తన్నింది. తాను ఓ మహిళగా వుంటూ.. మరో మహిళ గర్భంపై తన్న కూడదన్న ఇంకితాన్ని మర్చి.. అమెను మాతృత్వానికి దూరం చేసేలా ఎస్సీ దారుణంగా వ్యవహరించింది. దీంతో మహిళ గర్భవిచ్ఛిత్తి జరగడంతో బాధితురాలు విలవిల్లాడిపోయింది.

ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై స్థానిక న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. మహిళా ఎస్పీ గర్భిణీని బూటు కాలితో తన్నడంపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసింది. బాధిత మహిళ గర్భవిచ్ఛిత్తి జరగడానికి కారణమైన ఎస్పీపై కేసు నమోదు చేయాలని అదేశించింది. జిల్లా ఎస్సీ సౌమ్య మిశ్రాపై హెమగిర్ పోలీసులు కేసు నమోదు  చేయాలని అదేశించింది. ఈ కేసు విచారణను అమె సబ్ అర్డినేట్ అయిన ఢిప్యూటీ ఎస్పీ జ్యోత్సమయికి అప్పగించింది. అయితే దర్యాప్తు సాగే విధానంపైనే అనుమానాలు వున్నాయి.

అస్సలేం జరిగిందంటే.. గత నెల మూడో తేదీన సుందర్ గఢ్ జిల్లాలోని కణిక గ్రామంలో కారు ఢీకొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు కారణమైన నిందితులను అరెస్ట్ చేయాలంటూ గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. దీంతో స్పందించిన మహిళా ఎస్పీ సౌమ్య మిశ్రా స్వయంగా కేసు పర్యవేక్షణ చేపట్టారు. నిందితుల్లో బాధితురాలు ప్రియాడే, అమె భర్త ఉత్తమ్ డే కూడా ఉన్నాడు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న ఎస్పీ.. భర్త ఆచూకీ చెప్పాలంటూ విచక్షణ రహితంగా కొట్టారు. అక్కడితో ఆగక గర్భిణి అయిన ఆమె పొట్టపై బూటుకాలితో బలంగా తన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priya Dey  soumya mishra  IPS officer  pregnant woman  miscarriage  local court  Bhubaneswar  odisha  Crime news  

Other Articles