18000 candidates drop joining as village volunteers విధుల్లో చేరని 18వేల మంది గ్రామ వాలెంటీర్లు..

18 thousand selected candidates drop joining as village volunteers

AP chief minister, YS Jagan, gram volunteer JOBS, village volunteers, future Leaders, Andhra Pradesh, AP Politics

18 thousand village vounteers show dissatisfaction in joining duties as gram volunteers. The sources claims that they deny tha job after comparing their duties they have to perform with the salary they get.

విధుల్లో చేరని 18వేల మంది గ్రామ వాలెంటీర్లు.. వేతనమే కారణమా.?

Posted: 08/16/2019 06:35 PM IST
18 thousand selected candidates drop joining as village volunteers

ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వాలంటీర్ల నియామకాల్లో 18 వేల మంది విధుల్లో చేరడానికి నిరాకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో దాదాపు 2.69 లక్షల మంది వాలంటీర్లను ప్రభుత్వం రాతపరీక్షలు నిర్వహించి ఎంపిక చేసింది. వీరికి నెలకు 5 వేల రూపాయల గౌరవ వేతనాన్ని సైతం నిర్ణయించింది. అయితే ఇస్తున్న గౌరవ వేతనంతో పోలిస్తే చేయాల్సిన విధులు ఎక్కువగా ఉన్నాయన్న సాకుతో 18 వేల మంది తప్పుకున్నారని సమాచారం.

గ్రామ సచివాలయాలకూ, ప్రజలకు మధ్య సంధాన కర్తలుగా వ్యవహరిస్తూ నిజాయితీగా విధులు నిర్వర్తించాలని సూచించిన అధికారులు.. ఎంపికై శిక్షణ పోందిన వాలెంటీర్లకు నియామక పత్రాలు, ఐడీ కార్డులు ఇచ్చారు. కాగా పంద్రాగస్టు నుంచి విధుల్లో చేరాలని అదేశించింది. రేషన్ సరుకుల పంపిణీ, మీ సేవలో అందించే సేవలతో పాటు గ్రామ, వార్డు స్ధాయిలో అన్ని అనుమతులు, ధృవపత్రాల జారీ దరఖాస్తులు వంటి ఎన్నో సేవలను గ్రామ వాలంటీర్ల సాయంతో పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తోంది.

అయితే రేషన్ సరుకులు ఇంటింటికీ చేరవేయడాన్ని నామోషీగా భావిస్తుండటం, ఇంత చదువు చదువుకుని రేషన్ సరుకులు మోసుకోవాలా అన్న భావన వ్యక్తం కావడంతో వేల సంఖ్యలో ఎంపికైన వాలంటీర్లు విధులకు దూరమయ్యారు. దీంతో పాటు ఇతర విధులు కూడా నిర్వహించాలని.. అంతేకాదు ఇక ప్రతీదానికి వారినే జవాబుదారులుగా చేస్తారని కూడా వాలెంటీర్లు భావిస్తున్నారు. ఐదు వేల రూపాయల వేతనం కోసం ఇన్ని పాట్లు పడలా.. ఇదే వేరే ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తే రెండుమూడింతల అధిక వేతనం లభిస్తుందని భావిస్తున్నారు.

కాగా, గ్రామ వాలంటీర్లు సేవా భావంతో స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేసేందుకు వస్తున్నారనేది ప్రభుత్వం వాదన. గ్రామ వాటెంటీర్లు కేవలం విదులకు మాత్రమే పరిమితం కాదని, వారిని భవిష్యత్తులో నాయకులుగా ప్రోత్సహిస్తామని సీఎం జగన్ హామీ కూడా ఇచ్చారు. దీంతో వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. 18 వేల మంది ఈ ఉద్యోగాలకు విముఖత వ్యక్తం చేయడంతో.. రాతపరీక్షల్లో వారి తరువాత నిలిచిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles