Rahul Gandhi takes up J&K guv's challenge జమ్మూకాశ్మీర్ గవర్నర్ సవాల్ ను స్వీకరించిన రాహుల్

Rahul gandhi accepts j k governor satya pal malik s challenge

Article 370, India, Pakistan, Satyapal mallik, Rahul Gandhi, Curfew, section 144, kashmir updates, kasmir curfew, jammu and kashmir, jammu and kashmir news, kashmir situation, jammu situation, article 370 kashmir, politics

Congress leader Rahul Gandhi accepted Governor Satya Pal Malik's 'invitation' to visit Jammu and Kashmir but said he did not need an aircraft.

జమ్మూకాశ్మీర్ గవర్నర్ సవాల్ ను స్వీకరించిన రాహుల్

Posted: 08/13/2019 06:58 PM IST
Rahul gandhi accepts j k governor satya pal malik s challenge

జమ్మూకశ్మీర్ కు రాష్ట్రస్థాయి హోదాను తొలగించడంతో పాటు ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఎను కూడా తొలగించిన కేంద్రం.. ఆ రాష్ట్రాన్ని రెండుగా చీల్చి రెండు ప్రాంతాలను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా, అందులో జమ్మూకాశ్మీర్ ను అసెంబ్లీతో, లడఖ్ ప్రాంతాన్ని చట్టసభలేని ప్రాంతంగా చేసిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం అలుముకుందని, అక్కడి ప్రజలను కలిసేందుకు వచ్చిన నేతలను కూడా అడ్డుకుంటూ బలవంతంగా కేంద్రం స్థానిక ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా బిల్లును తెచ్చిందని అరోపణలు వస్తున్నాయి.

కాగా, ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేయగా, అందుకు జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా తీవ్రంగా స్పందించారు. రాహుల్ కోసం ప్రత్యేకంగా ఓ విమానం పంపుతానని, వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి చూసుకోవచ్చని పేర్కొన్నారు. రాహుల్‌ను బాధ్యత కలిగిన నాయకుడిగా అభివర్ణించిన సత్యపాల్ మాలిక్.. ఆయన ఇలాంటి బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. పార్లమెంటులో ‘ఇడియట్‌’లలా మాట్లాడిన సొంత పార్టీ నేతలను చూసి రాహుల్ సిగ్గుపడాలని తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.

జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యాపాల్ మాలిక్ చేసిన ట్వీట్ పై రాహుల్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ... "డియర్ గవర్నర్ మాలిక్. నాతో కూడిన విపక్ష నేతల బృందం, మీ ఆహ్వానం మేరకు జమ్మూ అండ్ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో పర్యటనకు వస్తోంది. మీ విమానం మాకేమీ వద్దు. అయితే, మేము స్వేచ్ఛగా తిరిగి, ప్రజలను కలుసుకుని, వారితో మాట్లాడే విషయంలో సహకరించండి. రాష్ట్ర నేతలను, సైనికులను కలుసుకునే ప్రయత్నాన్ని అడ్డుకోకండి" అని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Article 370  India  Pakistan  Satyapal mallik  Rahul Gandhi  Curfew  section 144  politics  

Other Articles