సమాజంలో పేరు ప్రతిష్టలు వున్న పెద్దలు వారి వ్యక్తిగత జీవితాల్లోని విషయాలను బయటకు ప్రపంచానికి తెలియకుండా చూసుకోవాలని భావించడం సహజం. కానీ తమను అభిమానించే అభిమానులు వున్నారన్న తరుణంలో తాము తెలిసి ఏ తప్పు చేయకూడదని మాత్రం భావించరు. అసలు తమకు సంబంధించిన విషయాలు బాహ్య ప్రపంచంలోకి వచ్చినా ఇబ్బంది లేదన్నట్లుగా వ్యవహరించరు. అదే అనర్థాలకు కారణమవుతుంది. ఫలితంగా సెలబ్రిటీ స్టేటస్ కూడా క్రమంగా కనుమరుగవుతుంది.
తాజాగా అలాంటి వ్యవహారంలో ఇక ఓ యువతిని లైంగికంగా వేధించడంతో పాటు, ఆమెపై చెయ్యి చేసుకున్న కేసులో టీవీ నటుడు అభినవ్ కోహ్లీని అరెస్ట్ చేసినట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. నగర పరిధిలోని సమతా నగర్ పోలీస్ స్టేషన్ కు తన తల్లితో కలిసి వచ్చిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అభినవ్ ను అదుపులోకి తీసుకున్నామని, ఆమె కూడా నటేనని తెలిపారు.
తనను దారుణంగా తిట్టడంతో పాటు, అసభ్యకరంగా ఉన్న మోడల్స్ ఫోటోలను తనకు నిత్యమూ చూపించి, కోరిక తీర్చమని బలవంతం పెట్టేవాడని సదరు నటి ఫిర్యాదు చేసిందని తెలిపారు. దీంతో అభినవ్ పై ఐపీసీ సెక్షన్ 354-ఏ, 323, 504, 506 కింద కేసును రిజిస్టర్ చేశామని, అతన్ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి, పోలీసు కస్టడీకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Dec 10 | దేశ పౌరసత్వ సవరణ బిల్లును వివాదాస్పదమైనదిగా పేర్కొంటూ అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) ప్రకటన చేయడాన్ని భారత్ తోసిపుచ్చింది. అమెరికా వాదన అసమంజసం, అవాస్తవమని ఆక్షేపించింది. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందితే... Read more
Dec 10 | మెట్రో రైలు ప్రయాణికులకు హెచ్ఎంఆర్ఎల్ సంస్థ తీపి కబరును అందించింది. ఇకపై ప్రతి రోజు ఈ రైళ్లలో ప్రయాణించేవారికి ఇది గుడ్ న్యూస్. మెట్రో రైలు ప్రయాణికులకు జీ5 మొబైల్ అప్లికేషన్ సేవలను హైదరాబాద్... Read more
Dec 10 | స్వతంత్ర్యం వచ్చే క్రమంలో కాంగ్రెస్ దేశాన్ని మత ప్రాతిపదికన రెండుగా విభజించి వుండకపోయివుంటే ఇవాళ దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను... Read more
Dec 10 | తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో.. తొలినాళ్లలో విమర్శలను ఎదుర్కోన్న తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు కూడా ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు.... Read more
Dec 10 | మానవ సంబంధాలన్నీ మనీ చుట్టూ తిరిగే బంధాలే అన్న పెద్దలు.. డబ్బుకు వున్న శక్తిని గ్రహించగలిగారే కానీ.. ప్రకృతిలో సగమైన ఆడవారు.. వికృతుల చేతుల్లో చిక్కి శల్యమౌతుందని గుర్తించలేకపోయారా.? సంబంధాలను పాతరేసి.. పైశాచిక మృగాళ్లలా... Read more