హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి విషాదకర రీతిలో కులూమనాలిలో ప్రాణాలు వదిలారు. హైదరాబాద్ లోని నాగోలు మోహన్ నగర్ ప్రాంతంలో నివసించే చంద్రశేఖర్ రెడ్డి ఓ వైద్యుడు. కొన్నిరోజుల క్రితం విహారయాత్ర నిమిత్తం హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్ కులుమనాలి వెళ్లారు.
అక్కడ పారాచ్యూట్ తో గాల్లో విహరించేందుకు చేసిన ప్రయత్నం విషాదాంతంగా మారింది. పారాచ్యూట్ గాల్లోకి లేచిన తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి దానిపై నియంత్రణ కోల్పోయారు. ఫలితంగా ఆయన గాల్లోంచి కిందపడిపోవడంతో బలమైన దెబ్బలు తగిలి మరణించారు. ఈ సమాచారం అందుకున్న ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ప్రమాదం జరగడానికి కొద్ది గంటల ముందే చంద్రశేఖర్ తమకు ఫోన్ చేసి మాట్లాడారని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంతలోనే ఈ విషాదం జరిగినట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి మరణించడంతో వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని హైదరాబాద్ తరలించడానికి అతడి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి సాయం చేయాల్సిందిగా కోరారు.
(And get your daily news straight to your inbox)
Dec 10 | దేశ పౌరసత్వ సవరణ బిల్లును వివాదాస్పదమైనదిగా పేర్కొంటూ అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) ప్రకటన చేయడాన్ని భారత్ తోసిపుచ్చింది. అమెరికా వాదన అసమంజసం, అవాస్తవమని ఆక్షేపించింది. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందితే... Read more
Dec 10 | మెట్రో రైలు ప్రయాణికులకు హెచ్ఎంఆర్ఎల్ సంస్థ తీపి కబరును అందించింది. ఇకపై ప్రతి రోజు ఈ రైళ్లలో ప్రయాణించేవారికి ఇది గుడ్ న్యూస్. మెట్రో రైలు ప్రయాణికులకు జీ5 మొబైల్ అప్లికేషన్ సేవలను హైదరాబాద్... Read more
Dec 10 | స్వతంత్ర్యం వచ్చే క్రమంలో కాంగ్రెస్ దేశాన్ని మత ప్రాతిపదికన రెండుగా విభజించి వుండకపోయివుంటే ఇవాళ దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను... Read more
Dec 10 | తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో.. తొలినాళ్లలో విమర్శలను ఎదుర్కోన్న తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు కూడా ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు.... Read more
Dec 10 | మానవ సంబంధాలన్నీ మనీ చుట్టూ తిరిగే బంధాలే అన్న పెద్దలు.. డబ్బుకు వున్న శక్తిని గ్రహించగలిగారే కానీ.. ప్రకృతిలో సగమైన ఆడవారు.. వికృతుల చేతుల్లో చిక్కి శల్యమౌతుందని గుర్తించలేకపోయారా.? సంబంధాలను పాతరేసి.. పైశాచిక మృగాళ్లలా... Read more