Schools and colleges opened in Jammu జమ్మూలో సాధారణ పరిస్థితి.. తెరుచుకున్న స్కూళ్లు, కాలేజీలు

Schools and colleges opened in jammu section 144 lifted off

jammu and kashmir, article 370, section 144, section 144 lifted, schools, colleges, article 35a, foreign affairs, politics

Section 144 of CrPC has been lifted in Jammu. As per the order, all schools, colleges, and academic institutions that are closed had resumed functioning normally from today

జమ్మూలో సాధారణ పరిస్థితి.. తెరుచుకున్న స్కూళ్లు, కాలేజీలు

Posted: 08/10/2019 10:07 AM IST
Schools and colleges opened in jammu section 144 lifted off

జమ్ము-కశ్మీర్‌ లో అర్ఠికల్ 370తో పాటు ఆర్టికల్ 35-ఎ ను కూడా భారత ప్రభుత్వం తొలగించి.. జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా చీల్చి.. జమ్మూకాశ్మీర్ ను అసెంబ్లీ వున్న కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ ప్రాంతాన్ని చట్టసభ లేని యూనియన్ టెరిటరీగా చేసిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు పార్లమెంటు అమోదం లభించడంతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అమోదం కూడా లభించడంతో తక్షణం అమల్లోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో పాక్ ప్రేరేపితానికి గురైన యువతతో పాటు ఏర్పాటువాదుల ప్రలోభాలకు గురైన స్తానికులు విధ్వంసానికి పాల్పడే అవకాశాలు వుంటాయని భావించిన భారత్.. జమ్మాకాశ్మీర్ సహా లఢఖ్ ప్రాంతంలో 144 సెక్షన్ ను విధించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం నాడు మసీదుల్లో ప్రార్థనల అనంతరం అల్లరి మూకలు నిరసనలకు, అందోళనకు దిగకుండా కూడా గట్టి చర్యలు తీసుకున్న భద్రతా బలగాలు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

కాశ్మీర్ ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగడంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో శనివారం నుంచి అక్కడ 144 సెక్షన్ ఎత్తివేస్తున్నట్లు జమ్మూ జిల్లా డిప్యూటీ మెజిస్ట్రేట్ ప్రకటించారు. శనివారం నుంచి విద్యా సంస్థలు పున:ప్రారంభించాలని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. భద్రతా పరమైన ఆంక్షలు ఎత్తివేయడంతో శుక్రవారం జమ్మూలో అనేకమంది ముస్లింలు మసీదులకు వచ్చి ప్రార్థనలు చేశారు. అయితే కశ్మీర్‌లో మాత్రం ఇంకా ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయని శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మునీర్ ఖాన్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles