hudndred cows died in vijayawada goshala విజయవాడలో విషాదం.. తాడేపల్లిలో 100 గోవుల మృతి..

Hudndred cows died in vijayawada kothuru tadepalli goshala

100 Cows, cows died, kothuru tadepalli, Goshala, Police, Postmerem, Vijayawada, Andhra Pradesh, Crime

hudndred cows died in suspicious stage in kothuru tadepalli village goshala near vijayawada of Andhra pradesh

విజయవాడలో విషాదం.. తాడేపల్లిలో 100 గోవుల మృతి

Posted: 08/10/2019 09:16 AM IST
Hudndred cows died in vijayawada kothuru tadepalli goshala

కృష్ణా జిల్లా విజయవాడలో విషాదం అలుముకుంది. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో ఇవాళ సుమారు 100 గోపులు మృత్యువాతపడ్డాయి. కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో ఈ విషాదఘటన చోటుచేసుకుంది. మరికొన్ని ఆవుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కంగారుపడిన నిర్వాహకులు గోశాలలో మిగిలిన ఆవులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఉన్నఫలంగా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో గోవులు మరణించడంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక గోశాల నిర్వాహకులు మాత్రం కలుషితమైన ఆహారం తీసుకునే ఆవులు మృత్యువాతపడ్డాయని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గోశాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆవులను దైవసమానంగా చూసుకునే  హిందువులు ఇలాంటి ఘటనపట్ల అశుభాలు జరుగుతాయా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కాగా మహిళలు మాత్రం గోశాలలో హృదయ విదారకరంగా పడివున్న మృతదేహాలు చూసి కన్నీరు పెడుతున్నారు.

ఈ గోశాలలో గతంలోనూ ఇదే విధంగా 30 గోవులు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకేసారి 100 ఆవులు చనిపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం రాత్రి ఆవులకు పెట్టిన దాణాలో ఏదైనా విష పదార్థాలు కలిశాయా అన్న అనుమానం కలుగుతోంది. ఆవుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తే నిజానిజాలు తెలుస్తాయని స్థానికులు అంటున్నారు గోశాల నిర్వాహకుల మీద కోపంతో ఎవరైనా కావాలనే ఈ దారుణానికి పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవులకు రాత్రి దాణా పెట్టిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై ప్రభుత్వాధికారులు ఆరా తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 100 Cows  cows died  kothuru tadepalli  Goshala  Police  Postmerem  Vijayawada  Andhra Pradesh  Crime  

Other Articles