IMD Rain Forecast in AP, Telangana తెలంగాణ, ఆంద్ర రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Deep depression to trigger heavy rains over telangana andhra

Bay of Bengal, Telangana, Telangana weather, Telangana rains, Rains in Andhra Pradesh, Krishna, Godavari, Karnataka, Maharashtra, Rains in Urbab Andhra, Rains in Rural Andhra, Rains in Andhra pradesh, Rains in Telangana, Rain Forecast

Heavy downpour will likely prevail over isolated parts of both Telangana and Andhra Pradesh for two days. Fishermen were advised not to venture into sea along Northwest Bay of Bengal over the next 24 hours.

తెలంగాణ, ఆంద్ర రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Posted: 08/08/2019 10:01 AM IST
Deep depression to trigger heavy rains over telangana andhra

తెలంగాణ రాష్ట్రంలో సాధారణ స్థాయి వర్షపాతం కూడా నమోదు కాలేదన్న జూలై మాసాంతం వరకు అందోళన చెందిన అన్నదాతలను కరుణించాడు వరుణుడు. అయితే వరుణుడు కరుణ అధికమై ఇక్కడి ప్రజలకు శాపంగా కూడా పరిణమిస్తోంది. ఇప్పటికే వరదల పరవళ్లతో దిగువకు వస్తున్న నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయ్యమై.. జనజీవనం స్థంభించింది. ఈ మాత్రం వరదలతోనే ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలపై వరుణుడు మరోమారు కుంభవృష్టి కురుపించనున్నాడన్న వార్త అందోళనలు రేకెత్తిస్తోంద.

రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించినట్టు హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం పేర్కొంది. వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో వర్సాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు గోవా, ఒడిశా రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని అధికారులు పేర్కోన్నారు. ఇక ఇప్పటికే ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార, నాగావళి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. హిరమండలం గొట్టాబ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

బ్యారేజీకి 1,12,210 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం అంతకంతకూ పెరిగిపోవడంతో బ్యారేజీ వద్ద అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అక్కరాపల్లి, రెల్లివలస, గులుమూరు తదితర గ్రామాల వద్ద పంట పొలాలు నీట మునిగాయి. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను అప్రమత్తం చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉండాలని సూచించారు. గొట్టాబ్యారేజీ వద్ద ఇంజనీర్లు వరద తీవ్రతను అంచనావేసి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bay of Bengal  Telangana  Andrha pradesh  Deep depression  IMD  Rain Forecast  

Other Articles