Last rites of Sushma Swaraj performed with state honours అశ్రునయనాల మధ్య చిన్నమ్మకు అంతిమ వీడ్కోలు..

Sushma swaraj cremated with full state honours nation bids final farewell

sushma swaraj, Sushma Swaraj death, State honours, Sushma Swaraj last rites, Sushma Swaraj cremation, Sushma Swaraj funeral, Sushma Swaraj daughter, sushma swaraj delhi cm, sushma swaraj husband, sushma swaraj latest news, sushma swaraj family, sushma swaraj holiday, swaraj Kaushal, sushma swaraj dead, age of sushma Swaraj, sushma swaraj passed away

The mortal remains of former external affairs minister Sushma Swaraj were consigned to flames at the Lodhi Road crematorium.

ITEMVIDEOS: అశ్రునయనాల మధ్య చిన్నమ్మకు అంతిమ వీడ్కోలు..

Posted: 08/07/2019 06:33 PM IST
Sushma swaraj cremated with full state honours nation bids final farewell

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ అంత్యక్రియలు ముగిశాయి. భరతమాత ప్రియపుత్రికకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు, బీజేపీ కార్యకర్తలు, అభిమానుల అశ్రు నయనాల మధ్య బుధవారం (ఆగస్టు 7) సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో సుష్మా అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఢిల్లీ రాష్ట్ర పోలీసు బలగాలు సుష్మా స్వరాజ్‌కు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం సుష్మా కుమార్తె బన్సూరీ ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

లోధి శ్మశాన వాటికలో సుష్మా భౌతిక కాయానికి పలువురు నేతలు తుది వీడ్కోలు పలికారు. సుష్మా అంత్యక్రియల సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు విషణ్ణ వదనంతో కనిపించారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ప్రముఖలంతా అక్కడే ఉన్నారు. విదేశాల నుంచి పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.
అధికారిక లాంఛనాలతో సుష్మా అంత్యక్రియలు

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ అగ్రనేత అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు సుష్మా పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. ఈ సమయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య ఉద్వేగానికి గురయ్యారు.

సుష్మా స్వరాజ్ పార్థివదేహాన్ని బుధవారం ఉదయం కార్యకర్తలు, నేతల సందర్శనార్థం బీజేపీ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. అనంతరం అభిమానులు, కార్యకర్తల అశ్రునయనాల మధ్య ఢిల్లీ వీధుల్లో సుష్మా స్వరాజ్‌ అంతిమ యాత్ర కొనసాగింది. లోధి రోడ్డులోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో సుష్మా అంత్యక్రియలు పూర్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushma Swaraj  death  State honours  last journey  last rites  funeral  cremation  

Other Articles