Rajya Sabha approves resolution on JK ఆర్టికల్ 370 రద్దును అమోదించిన రాజ్యసభ..

Article 370 jk vote to revoke article 370 in lok sabha today

Jammu And Kashmir, Lok Sabha, Congress, BJP, JDU, DMK, JK bifurfication, assembly, union territory, Amit Shah, President, Ramnath Kovind, Article 370, Article 35, Rajya Sabha, Politics

Article 370 Jammu and Kashmir: Restrictions have been put in place in J&K to ensure peace is maintained across the Valley. National Security Advisor Ajit Doval is scheduled to visit Jammu and Kashmir today to oversee the security measures.

ఇవాళ లోక్ సభ ముందకు జమ్మూకాశ్మీర్ పునర్విభజన బిల్లు

Posted: 08/06/2019 10:07 AM IST
Article 370 jk vote to revoke article 370 in lok sabha today

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించిన నేపథ్యంలో ఇవాళ లోక్ సభలోకి ఇందుకు సంబంధించిన నాలుగు బిల్లులను తీసుకురానుంది కేంద్రం. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ ను అసెంబ్లీ వున్న కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ ను పూర్తిస్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంతో పాటు జమ్మూకాశ్మీర్ లోని అర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న బిల్లులను ఇవాళ దిగువ సభ చర్చించి అమోదం తెలుపునుంది.

అయితే లోక్ సభలోజేపీకి పూర్తి మెజార్టీ ఉండటంతో ఈ బిల్లులకు అమోదం లభించడం నల్లేరు మీద నడకేనని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, పలు పార్టీలు కూడా ఈ బిల్లుల విషయంలో బీజేపీకి మద్దతు తెలుపుతున్నాయి. లోక్ సభలో బిల్లులకు ఆమోదం లభించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం రాష్ట్రపతి భవన్ కు వెళ్తుంది. రాష్ట్రపతి సంతకం చేశాక చట్ట రూపం దాల్చుతుంది.

రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు తీర్మానానికి కాంగ్రెస్ సభ్యుడు ఓటింగ్ కోరుతూ నోటీసు ఇవ్వడంతో.. మూజువాణి ఓటుతో ఆమోదించారు. అయితే లోక్ సభలో తమ సభ్యుల సంఖ్యబలం మూడింట రెండొంతుల పైనే వున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇక్కడ మాత్రం ఓటింగ్ కొరకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. జమ్ముకశ్మీర్ లో పరిస్థితులు చక్కబడ్డ తర్వాత అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న రాజ్యసభలో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu And Kashmir  Amit Shah  President  Ramnath Kovind  Article 370  Article 35  Rajya Sabha  Politics  

Other Articles