Vadodara cop video goes viral online ప్రాణాలకు తెగించి తల్లిబిడ్డల కాపాడిన ఎస్ఐ

Vadodara cop carries baby girl in tub on his head in neck deep water

gujarat floods, heavy rains, cop saves mother and child, cop carries two year old on his head, vadodara sub inspector video, Govind Chavda, vadodara si video goes viral online, viral video, video viral

As torrential rain lashed Vadodara in central Gujarat, a policeman saved the life of a baby girl by carrying her on his head through neck-deep water. SI Govind Chavda rescued a one-and- half-year-old girl from Devipura locality near Vishwamitri railway station.

ITEMVIDEOS: శభాష్ పోలీస్.. ప్రాణాలకు తెగించి తల్లిబిడ్డల కాపాడిన ఎస్ఐ

Posted: 08/03/2019 05:11 PM IST
Vadodara cop carries baby girl in tub on his head in neck deep water

వర్షాకాలంలో దేశవ్యాప్తంగా వరుణుడు రైతన్నలను కరుణిస్తున్నాడు. కాగా, పలు రాష్ట్రాలపై మాత్రం వరుణుడు తన ప్రతాపాన్ని చాటుతున్నాడు. అలాంటి రాష్ట్రాల్లో గుజరాత్ ఒక్కటి. ఈ రాష్ట్రంలోని వడోదరాలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వారికి సహాయంగా రెవెన్యూ అధికారులు, స్థానిక పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

వరదల కారణంగా రోడ్డు, రైలు రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. రైల్వేస్టేషన్ల పరిసరాలు, రైలు పట్టాలపై భారీగా వరద నీరు చేరడంతో 22 రైళ్లను రద్దు చేశారు. వడోదర విమానాశ్రయాన్ని తాత్కాలికంగా నిలిపి వేశారు. రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో ఆ ప్రభావం నేరుగా నిత్యావసరాలపై పడింది. రాష్ట్రంలో వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని సమీక్షించారు. గుజరాత్‌కు వర్షం గండం ఇంకా తప్పలేదు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

కాగా వడోదరలోని ఓ ఇంటి చుట్టూ విపరీతమైన వరద నీరు చేరడంతో సహాయక బృందాలకు సమాచారం వెళ్లింది. అయితే ఈ లోపు విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పీకల్లోతు నీరు చుట్టుముట్టిందన్ని తెలుసుకున్న పోలీసు ఎస్ఐ సదరు ఇంటి లోపల ఓ తల్లి పసిబిడ్డను పట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆమెను, ఆమె బిడ్డను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు నడుంబిగించాడు.



బాత్ టబ్‌ను నెత్తిన పెట్టుకుని.. అందులో పసిబిడ్డను జాగ్రత్తగా పడుకోబెట్టి.. మెడ లోతు నీళ్లల్లో ఒకటిన్నర కి.మీ అలాగే నడుచుకుంటూ వచ్చాడు. మెడలోతుగా వున్న నీరు కింద ఎక్కడ ఏముందో కూడా తెలియదు, అయినా ధైర్యంగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగాడు. ఇలా ఒకటిన్నర కిలోమీటరు నడిచిన తరువాత క్షేమంగా చిన్నారి బిడ్డను తమ వారికి అప్పగించాడు.  అంతేకాదు బిడ్డతో పాటు అమె తల్లిని కూడా గమ్యస్థానానికి చేర్చాడు.

బాత్ టబ్ లో ఓ బెడ్ షీట్ పరిచి.. అందులో పసిబిడ్డను పడుకోబెట్టి తలపై మోసుకుంటూ తీసుకొచ్చానని సదరు పోలీస్ అధికారి తెలిపారు. పోలీస్ చేసిన ఈ సహాయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏ చోట ఏముందో కూడా తెలయకుండా మొత్తంగా జలమయం అయిన ప్రాంతంలో ఎంతో సాహసంగా తల్లి బిడ్డలను కాపాడిన పోలీసు అధికారికి జనం జేజేలు పలికారు. ఐపీఎస్ షంషేర్ సింగ్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా అదికాస్తా వైరల్ గా మారింది. నెట్ జనులు ఆ పోలీససు అధికారికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gujarat floods  SI Govind Chavda  heavy rains  cop  mother  two yrs old child  vadodara  viral video  

Other Articles