BJP's Bishnu Sethi defends statement on triple talaq ముస్లిం మహిళలపై బీజేపి ఎమ్మల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Instant triple talaq forced muslim women into prostitution bjp mla

Bishnu sethi, triple talaq bill, Odisha, Congress, BJP odisha MLA, Odisha Assembly, prostitution, Bishnu sethi controversial statements, Bishnu sethi muslim women, Bishnu sethi prostitution, BJP MLA remarks, politics

BJP MLA and the party's Deputy Leader in Odisha Assembly, Bishnu Sethi said Congress was unnecessarily creating problems on his statement on the ordeals faced by women who were given triple talaq.

ముస్లిం మహిళలపై తన వ్యాఖ్యలను సమర్ధించుకున్న బీజేపి ఎమ్మల్యే

Posted: 08/03/2019 09:28 AM IST
Instant triple talaq forced muslim women into prostitution bjp mla

ముస్లిం మహిళలపై ఒడిశాకు చెందిన బీజేపీ ఉపనాయకుడు బిష్ణు సేథీ చేసిన వ్యాఖ్యలై ఓ వైపు దుమారం రేగుతున్న క్రమంలో ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, అనవసరంగా కాంగ్రెస్ నేతలు తన వ్యాఖ్యలను రాద్దాంతం చేస్తున్నారని, తాను అన్న వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదాస్పద అంశానికి తావులేదని, తాను నిజాన్ని మాత్రమే వెల్లడించానని పేర్కోన్నారు.

అటు దేశానికి ఇరువైపులా వున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా ట్రిపుల్ తలాక్ పద్దతి లేదని ఆయన తెలిపారు. ఈ అంశం బీజేపికి సంబంధించినది కాదని, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రింకోర్టు మార్గదర్శకాలను కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం అమలుపర్చేందుకు మాత్రమే చర్యలు తీసుకుందని, ఇందులో తమ పార్టీ తప్పిదమేముందని ఆయన ఎదురు ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ట్రిఫుల్ తలాక్ బాధిత మహిళలు తమ కూతుళ్లేనని ఆయన తన వ్యాఖ్యలను తెలివిగా సమర్ధించుకున్నారు.

రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన విషయమై ఒడిశా అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిష్ణు సేథీ మాట్లాడుతూ, ముంబై, కోల్ కతాల్లోని వేశ్యా గృహాల్లో ముస్లిం మహిళలు ఎక్కువగా ఉన్నారని వ్యాఖ్యానించారు. వీరంతా ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్న బాధితులేనని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేడీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే నరసింగ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపి మతతత్వ పార్టీ అన్న విషయం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందేనని అన్నారు. ఈ నిజాన్ని బీజేపి నేతలు తమ మాట్లలో అంగీకరించకపోయినా.. వారి చేతల్లో మాత్రం పదే పదే బహిర్గతం అవుతూనే వుంటుందని అన్నారు. కేవలం ముస్లిం మహిళలను చులకన చేయడానికే బీజేపి నేతలు ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేశారని ఆయన విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bishnu sethi  triple talaq bill  Odisha  Congress  BJP odisha MLA  Odisha Assembly  prostitution  politics  

Other Articles