new turn in Hayathnagar woman Kidnap Case హయత్ నగర్ కిడ్నాప్ కేసులో కొత్త మలుపు

New turn in hayathnagar woman kidnap case

Soni kidnap news,Soni kidnap update,Hayatnagar kidnap case,pharmacy student soni,kidnapped Soni released,Kidnapper releases Soni,Soni,Hayathnagar,Addanki, Soni, B.pharma student, kidnap, Ravi shekar, Addanki, Prakasam, Andhra pradesh, Telangana, crime

New twist had taken place in the case of B Pharmacy student Soni, who was allegedly said to be kidnapped on July 23 from Hayatnagar. by Ravi Shekar, Now soni says she went in search of job on her will and no one kidnapped her.

హయత్ నగర్ కిడ్నాప్ కేసులో కొత్త మలుపు

Posted: 07/31/2019 09:46 AM IST
New turn in hayathnagar woman kidnap case

వారం రోజులుగా నగరవాసులతో పాటు తెలుగురాష్ట్రాల ప్రజలను తీవ్ర అందోళనకు గురిచేసిన హయత్‌నగర్ కిడ్నాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ నెల 23న కిడ్నాప్‌కు గురైన బీఫార్మసీ విద్యార్థిని సోని ఆచూకీ వారం రోజుల తర్వాత మంగళవారం లభ్యమైన విషయం తెలిసిందే. అమెను మౌని అనే మరో యువతి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో గుర్తించి పోలీసులతో పాటు తమ కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికిన మోస్ట్ వాంటెడ్ ఘరానా మోసగాడు రవిశేఖర్ ఆమెను కారులో అపహరించుకుని తీసుకెళ్లాడని ఇప్పటివరకు అందరూ భావించారు. పోలీసులు సైతం ఇదే కోణంలో కేసును దర్యాప్తు చేశారు. ఇక రవిశేఖర్ తల్లి సైతం అమాయకురాలైన ఓ అడబిడ్డనుని కిడ్నాప్ చేసిన తన కొడుకు రవిశేఖర్ ను చంపేయండని కూడా అన అవేదనను వెల్లగక్కింది. ఇలాంటి తరుణంలో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.

సోని ఎంజీబీఎస్ లోని దేవరకొండ ఫ్లాట్ ఫాం వద్ద  ప్రత్యక్షమైంది. బాధితురాలిని గుర్తుపట్టిన స్నేహితురాలు.. మీడియాలో వస్తున్న వార్తల గురించి చెప్పి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావని ప్రశ్నించింది. దీనికి ఆమె చెప్పిన సమాధానం విని విస్తుపోయింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఉద్యోగం కోసం వెళ్లానని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది. దీంతో ఆమె బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడించింది. విషయాన్ని వారు పోలీసులకు చెప్పడంతో అందరూ కలిసి ఎంజీబీఎస్‌కు చేరుకుని ఆమెను తీసుకెళ్లారు.

సోనిని విచారించిన పోలీసులు సాయంత్రం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. కాగా, కిడ్నాప్ చెరలో వారం రోజులు ఉన్న ఆమె.. తనను అతడు కిడ్నాప్ చేశాడన్న విషయాన్ని తెలుసుకోలేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వారం రోజులుగా ఆమె అతడి వెంట ఉన్నప్పటికీ తల్లిదండ్రులతో ఒక్కసారి కూడా మాట్లాడించకుండా నిందితుడు రవిశేఖర్ ఎలా మేనేజ్ చేశాడన్న విషయం పోలీసులకు అంతు చిక్కడం లేదు. ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి బాధిత యువతి బస్సులో ఎంజీబీఎస్ బస్టాండుకు చేరుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Soni  B.pharma student  kidnap  Ravi shekar  Addanki  Prakasam  Andhra pradesh  Telangana  crime  

Other Articles