Jaipal Reddy cremated with state honours అశ్రునయనాల మధ్య అజాతశత్రువుకు అంతిమవీడ్కోలు

Jaipal reddy s last rites held with full state honours

Andhra Pradesh, congress, ESL Narasimhan, Ghulam Nabi Azad, Hyderabad, Indrakaran Reddy, K Chandrashekar Rao, M Venkaiah Naidu, MAHMOOD ALI, Mallikarjun Kharge, necklace road, S Jaipal Reddy, Siddaramaiah, T Srinivas Yadav, Telangana

Senior Congress leader and former Union Minister S. Jaipal Reddy was cremated with full state honours. Relatives, friends and leaders of Congress and other parties bid adieu to Jaipal Reddy,

అశ్రునయనాల మధ్య అజాతశత్రువుకు అంతిమవీడ్కోలు

Posted: 07/29/2019 04:58 PM IST
Jaipal reddy s last rites held with full state honours

దేశరాజకీయాలలో తనదైన ముద్రవేసిన అజాతశత్రువుగా, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహిత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలు సోమవారం నాడు పీవీఘాట్‌లో ముగిశాయి. అధికారిక లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలను నిర్వహించింది.  అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున ఆయన కన్నుమూశారు. ఉదయం జైపాల్ రెడ్డి నివాసం నుండి ఆయన పార్థీవదేహన్ని గాంధీభవన్‌కు తీసుకొచ్చారు.

పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తల సందర్శనార్ధం గాంధీభవన్ లో జైపాల్ రెడ్డి పార్థీవ దేహాన్ని ఉంచారు. గాంధీభవన్ నుండి  పీవీ ఘాట్‌ వరకు అంతిమయాత్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, ‌లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ మాజీ నేత మల్లిఖార్జున ఖర్గే, ,కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ తదితరులు కూడ జైపాల్  తెలంగాణకు చెందిన పలు పార్టీ నేతలు కూడ జైపాల్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

పార్టీ నేతలు, కుటుంసభ్యులు, సన్నిహితులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ఆయన అనుచరులు, అనూయాయువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆశ్రునయనాలతో తమ ప్రియతమ నేతకు చివరిసారి వీడ్కోలు పలికారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా.. గాంధీభవన్ నుంచి ప్రారంభమై.. పీవి ఘాట్ వరకు సాగిన అంతిమయాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.

పాడె మోస్తూ.. కన్నీరుమున్నీరైన రమేష్ కుమార్

జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కన్నీళ్లు పెట్టుకొన్నారు. యడియూరప్ప బలపరీక్ష పూర్తైన తర్వాత రమేష్ కుమార్ హుటాహుటిన జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైద్రాబాద్ కు వచ్చారు. ఎయిర్‌పోర్ట్ నుండి రమేష్ కుమార్ పీవీఘాట్ కు చేరుకొన్నారు. పీవీఘాట్‌లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పక్కనే రమేష్ కుమార్ కూర్చొన్నారు.

జైపాల్ రెడ్డి అంతిమయాత్ర సందర్భంగా కుటుంసభ్యులతో కలిసి కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ పాడె మోసారు. ఈ సమయంలో రమేష్ కుమార్ కన్నీళ్లు పెట్టుకొన్నారు. జైపాల్ రెడ్డిని గుర్తు చేసుకొంటూ కన్నీళ్లు ఆపుకొనే ప్రయత్నం చేశారు. రమేష్ కుమార్ తరచూ జైపాల్ రెడ్డిని కలిసేవాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. బలవంతంగా కన్నీళ్లు ఆపుకొంటూ జైపాల్ రెడ్డి పాడె మోసారు. పాడె మోసిన తర్వాత కూడ రమేష్ కుమార్ ఆయనను పదే పదే గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles