Yeddyurappa Changes Name to Yediyurappa పేరు మార్చుకున్న యడ్యూరప్ప

Yeddyurappa changes name to yediyurappa

Yeddyurappa,Yediyurappa,Karnataka,BJP

Yeddyurappa Changes Name to Yediyurappa

పేరు మార్చుకున్న యడ్యూరప్ప

Posted: 07/26/2019 06:31 PM IST
Yeddyurappa changes name to yediyurappa

ఆటలో అచ్చిరావడంలేదని ఆటగాళ్లు, సినిమాళ్లో కలిసి రావడంలేదని సినీ నటులు పేర్లు మార్చుకోవడం సహజంగా చూస్తూఉంటాం. తాజాగా  రాజకీయాల్లో తనకు అదృష్టం​​​​​ కలిసిరావడం లేదని భావించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పేరును మార్చుకున్నారు. కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా తాజాగా ఇదే కోవలోకి వచ్చారు. ఇది వరకు ఆయన మూడుసార్లు సీఎం పదవి చేపట్టినప్పటికీ పూర్తికాలం అందులో కొనసాగలేదు. ఈ నేపథ్యంలో ఆయన తన పేరులో స్వల్ప మార్పులు చేసుకున్నారు.ఇప్పటివరకు ఆయన పేరు యడ్యూరప్ప (BS Yaddyurappa) అని ఉండగా.. తాజాగా యడియూరప్ప (BS Yadiyurappa)గా మార్చుకున్నారు. 2007లో తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పుడు ఆయన పేరులో మార్పులు చేసుకున్నారు. యడియూరప్ప(BS Yediyurappa)ను యడ్యూరప్ప( BS Yeddyurappa)గా మార్చుకున్నారు. రాజకీయంగా ఆ సమయంలో కాస్త గడ్డుకాలాన్ని ఎదుర్కోవడంతో జ్యోతిషుడి సలహా ప్రకారం పేరులో అక్షరాలను మార్పు చేసుకున్నారు. కానీ ఆ ఫార్ములా వర్కవుట్‌ కాలేదని భావించిన యడ్డీ.. తాజాగా మళ్లీ పేరులో మార్పు చేశారు. అందుకే శుక్రవారం గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాకిచ్చిన లేఖలో తన పేరును తిరిగి యడియూరప్ప(Yediyurappa) అనే పేర్కొన్నారు. మరి ఈసారైనా ఆయనకి అదృష్టం కలిసివస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yeddyurappa  Yediyurappa  Karnataka  BJP  

Other Articles