liquor shops to increase in telangana from october మందుబాబులకు జోష్.. పెరగనున్న మద్యం దుకాణాలు..

Liquor shops to increase in telangana from october

liquor shops to increase in telangana, liqour patrial ban in Andhra Pradesh, Income on Liquor, telangana new excise policy, liqour shop in every mandal, telangana excise department, andhra pradesh news, Andhra Pradesh, Telangana news, Telangana

If sources ar to be believed, Telangana Government is plannimg to increase the number of liquor shops according to new excise policy which comes into force from October this Year.

మందుబాబులకు జోష్.. మండలానికో మద్యం దుకాణం

Posted: 07/25/2019 08:34 AM IST
Liquor shops to increase in telangana from october

తెలంగాణను మధ్యంబాబులకు అడ్డాగా ప్రభుత్వం మార్చుతుందని ఇప్పటికే అనేక అరోపణలు వస్తున్న క్రమంలో వాటన్నింటినీ తోసిపుచ్చుతూ మందుబాబులకు మరో న్యూజోష్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నధమవుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2017లో రూపొందించిన అబ్కారీ విధానం గడువు సెప్టెంబరుతో ముగిసిపోనుంది. దీంతో అక్టోబరు ఒకటో తేదీ నుంచి నూతన ఆబ్కారీ విధానం అమల్లోకి రానుంది.

ఈ విధానం రెండేళ్లపాటు అమల్లో వుంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాలకు మరిన్ని వైన్ షాపులు అదనంగా చేర్చబోతున్నాయి. ఓ వైపు ప్రతిపక్షాలతో పాటు ప్రజాసంఘాలు, మహిళాసంఘాలు మద్యం దుకాణాలపై విరుచుకుపడుతున్నా.. మద్యం దుకాణాల పెంపుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. పోరుగున్న తెలుగు రాష్ట్రంలో అక్కడి నూతన ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పాక్షిక మధ్యం అమ్మాకాల బంద్ విధానాన్ని చూసి కూడా మద్యం అమ్మకాలను ప్రోత్సహించి ప్రజారోగ్యానికి తూట్లు పోడిచే విధానాన్ని ఎందుకు అమలుపరుస్తున్నారని నిలదీస్తున్నాయి.

తెలంగాణలోని ప్రభుత్వం అంతా ప్రజల కోసమేనని బడాయిలు చెబుతున్నా.. ఆదాయం కోసమే కొత్త మార్గాలను అన్వేషిస్తోందని, ఇందులో భాగంగానే కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేశారంటూ కూడా పలు అరోపణలు తెరపైకి వస్తున్నాయి. అయితే తెలంగాణ అబ్కారీ శాఖ అధికారులు మాత్రం వీటన్నింటినీ పక్కకునెట్టి.. మద్యం దుకాణాలు లేని కొత్త మండలాల్లో కొ్తగా వైన్స్ షాపులు పెట్టేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశారని సమాచారం. దీంతో.. మండలానికో మద్యం దుకాణం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలతోపాటు 125 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో దాదాపు సగం మండలాల్లో మద్యం దుకాణాలు లేవు. దీంతో అక్కడున్న డిమాండ్‌ను బట్టి ఆయా మండలాల్లో కొత్త మద్యం షాపుల ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంతోపాటు ప్రస్తుతం దుకాణాలు ఉన్న మండలాల్లో డిమాండ్‌ను బట్టి మరిన్ని షాపుల ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆబ్కారీ అధికారులు యోచిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2216 వైన్‌ దుకాణాలు, 670 బార్లు ఉన్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : liquor shops  increase  telangana  new excise policy  new wine shops  new mandals  Telangana  

Other Articles