Rahul Bose shocked over banana bill రెండు అరటిపళ్ల ధరతో చుక్కలు చూసిన నటుడు.!

Rahul bose shocked over banana bill at chandigarh 5 star hotel

rahul bose, rahul bose jw marriott chandigarh, Rahul Bose banana video, Rahul BoseTwitter, Rahul Bose banana news, rahul bose banana chandigarh five star hotel, viral, twitter, rahul bose news, chandigarh news, chandigarh

Rahul Bose had ordered room service for two bananas while at the luxury hotel. But when the bill arrived, he was in for a shock. For the two bananas that he ordered, the hotel charged Bose Rs 442.50.

ITEMVIDEOS: రెండు అరటిపళ్ల ధరతో చుక్కలు చూసిన బాలీవుడ్ నటుడు.!

Posted: 07/24/2019 04:51 PM IST
Rahul bose shocked over banana bill at chandigarh 5 star hotel

ఆయన మరెవరో కాదు బాలీవుడ్ నటుడు. ఆయన తలుచుకుంటే.. పట్టపగలు చుక్కలు చూడగలడు. కానీ ఆయనను కూడా వదలకుండా చుక్కలు చూపేవారు వుంటారా.? అంటే వున్నారు. వాళ్లు మరెవరో కాదు పేరులోనే నక్షత్రాలను కలిగివుండే స్టార్ హోటల్ యజమాన్యాలు. అవునా.? అంటూ విస్తుపోతున్నారా.? కానీ ఇది నిజం. బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ కు ఛండీగడ్ లోని మ్యారియట్ హోటల్ లో ఇదే అనుభవం ఎదురైంది.

అదెలా.? అయన ఏమైనా అంత ఖరీదైన పదార్థాలను అర్డర్ చేశారా.? అన్న సందేహమే వద్దు. ఆయన ఆర్డర్ చేసింది.. పది రూపాయల పధార్థమే.. కానీ శంఖంలో పోస్తేకానీ తీర్థం కాదనట్టు.. అక్కడి ఐదు నక్షత్రాల (ఫైవ్ స్టార్ హోటల్). ఆయన ఆర్డర్ చేసింది కేవలం రెండు అరటి పళ్లు మాత్రమే. ఆ అరటిపండ్లేమీ దేవలోకం నుంచి ఊడిపడలేదు. అలాగని వాటికి ఏ ప్రత్యేకతా లేదు. దీంతో స్టార్ హోటల్ కాబట్టి ఏ యాభై రూపాయలో బిల్లు వేస్తారని అనుకుంటూ.. ఏకంగా అరటిపళ్లతో పాటు వచ్చిన భిల్లు చూసి ఆయన విస్తుపోయారు.

ఎందుకంటే ఆ రెండు సాధారణ అరటిపళ్ళ ధర ఏకంగా 442.50 రూపాయలట. రెండు అరటిపళ్లంటే రెండే. రెండు డజన్లో లేక రెండు గెలలో కాదు. అంటే ఒక్కో అరటిపండు 221.25 రూపాయలన్నమాట. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. విన్నమనకే కాదు.. వాటి ధర చూసిన బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌ కూడా షాకయ్యాడు. వెంటనే బిల్లు చెల్లించిన ఆయన ఈ విషయాన్ని తన సహచరులతో పాటు తన ఫాలోవర్స్ అందరికీ తెలపాలని పూనుకున్నాడు. అంతే అది కాస్తా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యింది.

షూటింగ్ నిమిత్తం చండీగఢ్ వెళ్లిన రాహుల్.. అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశాడు. జిమ్‌కు వెళ్లొచ్చి రెండు అరటి పండ్లకు ఆర్డర్ ఇచ్చాడు. పండ్లతోపాటు వచ్చిన బిల్లు చూసి నోరెళ్లబెట్టాడు. వాటిపై ఏకంగా రూ.442.50 బిల్లుండడంతో మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. కాసేపటి తర్వాత తేరుకుని బిల్లును పరిశీలిస్తే సెంట్రల్ జీఎస్టీ కింద రూ.33.75, యూటీ జీఎస్టీ కింద మరో రూ.33.75 వేసి మొత్తం బిల్లును రూ.442.50గా చూపించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన రాహుల్.. అరటిపండ్లు కూడా ఆరోగ్యానికి హానికరమేనని ట్వీట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles