IMA scam: Khan confesses key details to ED ఈడీ వద్ద కీలక ఆధారాలు.. కర్ణాటక నేతలకు రూ.400 కోట్లు

Ima scam mohammad mansoor khan confesses key details to ed

Mohammad Mansoor Khan, I Monetary Advisory, IMA, Enforcement Directorate, Bengaluru, Scam, ponzi scam, karnataka politicians, karnataka top officials, crime, India

After city court remanded multi-crore 'I Monitory Advisory' (IMA) Group founder and Managing Director Mohammad Mansoor Khan, the accused had confessed the key details to Enforcement Directorate sleuths.

ఈడీ వద్ద కీలక ఆధారాలు.. కర్ణాటక నేతలకు రూ.400 కోట్లు

Posted: 07/22/2019 10:33 AM IST
Ima scam mohammad mansoor khan confesses key details to ed

తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా.. ప్రజల నెట్టిన శఠగోపం పెట్టి నాలుగు వేల కోట్ల రూపాయల మేర దోచుకన్న ఐఎంఏ జవెలర్స్ సంస్థ యజమాని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు పలు కీలక విషయాలను ఆధారాలతో సహా వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏకంగా తాను దోచుకున్న దాంట్లోంచి తనను కాపాడే పనిని భుజానికెత్తుకున్న పలువురు కర్ణాటక రాష్ట్ర ప్రముఖ రాజకీయ నేతలు, ఉన్నతాధికారులకు తాను ఏకంగా రూ.400 కోట్ల రూపాయలను లంచంగా ముట్టజెప్పినట్లు ఈడీ అధికారులకు ఎదట వెల్లడించాడని తెలిసింది.

ప్రజల నుంచి సుమారు రూ. 4 వేల కోట్లను డిపాజిట్లుగా సేకరించి, వాటిని తిరిగి చెల్లించకుండా మోసం చేశారని మన్సూర్ పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ, అతన్ని అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ  విచారణలో మన్సూర్ పలు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తుండటంతో, కన్నడనాట పలువురు నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఈ కేసులో ఎక్కడ తాము ఇరుక్కుపోతామా? అని పలువురు ఆందోళన చెందుతున్నట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇదే కేసులో ఇప్పటికే ఓ ఐఏఎస్‌ అధికారిని ప్రత్యేక దర్యాఫ్తు బృందం అరెస్టు చేసింది. కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ ను తమ కార్యాలయానికి పిలిపించి విచారించారు. ఇదిలావుండగా, తనకు ఛాతీలో నొప్పిగా ఉందని విచారణ సందర్భంగా మన్సూర్‌ ఖాన్‌ చెప్పడంతో నిన్న రాత్రి ఆయన్ను సర్‌ జయదేవ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mansoor Khan  IMA  ED  ponzi scam  karnataka politicians  karnataka top officials  Bengaluru  crime  

Other Articles