Kia Motors unveils mid-size SUV Seltos మెడిన్ ఏపీ.. కియా నుంచి తొలి ఎస్ యూ వీ

Kia unveils seltos in india packs it with premium features

kia, Kia Seltos, Kia Seltos details, Kia Seltos features, Kia Seltos Launch, Kia Seltos launch live, Kia Seltos Live, kia seltos live launch, kia seltos live updates, Kia Seltos price, Kia Seltos SUV, Kia Seltos unveil, Live Launch, live updates, Seltos, Seltos design, Seltos features, Seltos Launch, Seltos launch live, Seltos live unveil, Seltos price, Seltos unveil, politics

Kia Motors have been setting up excitement for the launch of their first product since forever now, and finally, they have unveiled their first product for India – the Seltos, a fantastic looking SUV.

అనంతపురం కియా మోటార్స్ నుంచి తొలి ఎస్.యూ.వీ

Posted: 06/20/2019 01:33 PM IST
Kia unveils seltos in india packs it with premium features

సౌత్ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం కియా కంపెనీకి సంబంధించి సెల్టోస్ ఎస్‌యూవీని ఇవాళ(20 జూన్ 2019) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే కియా మోటార్ భారతీయ మార్కెట్‌తో పాటు విడుదల చేయబోయే కియా సెల్టోస్ ఎస్‌యూవీ సంబంధించిన విశేషాలతో కూడిని వీడియోను విడుదల చేసింది. అయితే భారతదేశం నుండి తొలిసారి ఉత్పత్తి అవబోతున్న కియా బ్రాండ్ ఇది.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంటులో సంస్థ సెల్టోలను తయారు చేస్తుంది. భారతదేశంలో ప్రవేశించిన తర్వాత, హుందాయ్ క్రీటా, జీప్ కంపాస్, మహీంద్రా XUV500 మరియు టాటా హారియర్ వంటి వాటితో కియా సెల్టోస్ పోటీపడుతోంది. ఇంతకు ముందు ఎస్పీ 2 ఐ అని పిలిచే కియా సెల్టోస్ ఇప్పుడు విడుదల చేస్తున్నారు. అధునాతన ఎస్‌పీ కాన్సెప్ట్‌ ఎస్‌యూవీ మోడల్‌ కారును గతేడాది అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం లాంఛనంగా ఆవిష్కరించారు.

అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద 'కియా మోటార్స్ ఇండియా' కంపెనీ ప్లాంట్లో ఈ కార్యక్రమం జరిగింది. కియా మోటార్స్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్ 15వది. బిలియన్ డాలర్లు వెచ్చించి నిర్మించిన ఈ ప్లాంట్ నుంచి ఏడాదికి 3 లక్షల యూనిట్ల వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉంది.యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో ప్రకారం.. టైగర్ ముక్కు గ్రిల్, సిల్వర్ క్రోమ్‌లతో ముందు బాగం హెడ్‌ల్యాంప్‌లు మరియు షార్క్ ఫిన్ యాంటెన్నాతో చూడడానికి చాలా ఎట్రాక్టివ్‌గా ఉంది.

డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి రియర్ టెయిల్ లాంప్స్ మరియు ఎల్ఇడి డిఆర్ఎల్‌లను కూడా వివరించింది. ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్ అప్ డిస్‌ప్లే, ఎంఐడి, 360 డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు ముందు మరియు వెనుక సీట్ల కోసం హెడ్ రెస్ట్‌లు, బోస్ సౌండ్ సిస్టమ్ సెల్టోస్‌లో ఉన్నాయి. కియా సెల్టోస్ బిఎస్ VI కంప్లైంట్ 1.5 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లలో ఇది ఉంది. కియా సెల్టోస్ ధర రూ.10లక్షల నుంచి 16 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kia  Kia Seltos  Launch  price  SUV  Kia make in Andhra Pradesh  Kia motors anantapur  

Other Articles

 • Ktr responds to director maruthi s tweet over water supply in hyderabad

  కేటీఆర్‌ సర్.. నేను విన్నది నిజమేనా!

  Jul 17 | ప్రముఖ దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ట్విటర్‌ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.‘హైదరాబాద్‌కు... Read more

 • Supreme court to take decision on petition of karnataka rebel mlas today

  కర్ణాటక సంక్షోభం.. కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీం!

  Jul 17 | మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయానికి సుప్రీంకోర్టు చెక్ పెడుతుందా? తీర్పు ఎలా ఉండబోతోంది? దాదాపు నెల రోజులుగా పరిపాలన అటకెక్కి... వ్యూహాలు, ప్రతివ్యూహాలతో వేడెక్కిన కర్ణాటకలో స్వార్థ రాజకీయాలకు ఇవాళ బ్రేక్ పడే అవకాశాలు... Read more

 • Trafic challans on violation of motor vehicle rules

  బంబేలెత్తిస్తున్న ట్రాఫిక్ జరిమానాలు..!

  Jul 16 | ఎన్నాళ్ల నుంచో వాహనదారులను బెంబేలెత్తిస్తున్న అధిక జరిమానాల పోటు బిల్లు పార్లమెంటులోకి వచ్చి చేరింది. దీంతో ఎన్ని తప్పులు చేసినా ఇన్నాళ్లు పోతే కొంతేగా అని యధేశ్చగా తప్పులను చేసినా వారి గుండెల్లో ఇక... Read more

 • Biswabhusan harichandan appointed as new andhra pradesh governor

  ఏపీకి కొత్త గవర్నర్‌

  Jul 16 | ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను కేంద్రం కేటాయించింది. ఒడిశాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర... Read more

 • Woman dies in fight over drinking water at public tap in srikakulam

  శ్రీకాకుళంలో నీళ్ల కోసం మహిళల ఘర్షణ... ఒకరి మృతి

  Jul 16 | బిందెడు నీళ్లు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో తాగునీటి కుళాయి వద్ద మహిళలు బిందెలతో కొట్టుకోవడంతో పద్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మంచి నీళ్లు కోసం వెళ్లిన... Read more

Today on Telugu Wishesh