రైల్వే టీటీఈలకు ప్రయాణికుల టికెట్‌ను చెక్ చేసుకుంటాడు. ఇప్పటి వరకు టికెట్ చెక్ చేయడమే అతని బాధ్యతగా ఉండేది. దీనికి మరో అదనపు బాధ్యతను కూడా రైల్వేశాఖ టీటీఈలకు అప్పగించింది. ఇంతకీ టీటీఈలకు అదనంగా రైల్వే శాఖ ఇచ్చిన బాధ్యతలు ఏమిటి..? రైల్వే శాఖ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఆలోచనతో టీటీఈలకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ప్రయాణికుల టికెట్ చెక్ చేయడంతో పాటు జనరల్ మరియు స్లీపర్‌కోచ్‌లలో ఉండే టాయ్‌లెట్స్‌ను చెక్ చేసే బాధ్యత కూడా టీటీఈలు తీసుకోవాల్సి ఉంటుంది. టాయ్‌లెట్స్ పరిశుభ్రంగా ఉన్నాయో లేదో చూసి ఒకవేళ శుభ్రంగా లేకపోతే రైలులో ఉండే క్లీనింగ్ సిబ్బందిని పిలిచి వారితో శుభ్రం చేయించేలా ఆదేశించాలని రైల్వేశాఖ తెలిపింది. అంతేకాదు కోచ్‌లు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేలా సిబ్బందికి సూచించాలని వెల్లడించింది.ఇక కోచ్‌లలో నీటి సదుపాయం ఉందా లేదా అనేది కూడా పరిశీలించాల్సిన బాధ్యత టీటీఈలకే అప్పజెప్పింది. నిర్ణీత సమయానికి కోచ్‌లు క్లీన్ అయ్యేలా చూసుకోవాలని రైల్వే శాఖ తెలిపింది. రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ అంగది ఈ మేరకు రైల్వే బోర్డుకు సూచనలు చేశారు.ఇక ఈ నెలాఖరు కల్లా అధికారికంగా ఆదేశాలు జారీ చేస్తామని ఆయన చెప్పారు. ఇక కోచ్‌లను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయాణికుల్లో కూడా అవగాహన తీసుకొస్తామని ఆయన తెలిపారు. ప్రయాణికులు ఇందుకు సహకరించాలని సురేష్ అంగది వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Dec 10 | దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ లో కొత్త ట్విస్టు నెలకొంది. జాతీయ మానవహక్కుల సంఘం సభ్యులు వచ్చి నిందితుల కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించిన క్రమంలో నిందితుల్లో... Read more
Dec 09 | ముంబైలో బార్ గాళ్స్ ను చెప్పులు లేకుండా పోలిస్ స్టేషన్ కు నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై ముంబై పోలీస్ ఉన్నతాధికారులు శాఖపరమైన విచారణను అదేశించారు. ముంబై లాంటి ప్రాంతాల్లో బార్లలో బార్ గాళ్స్ ను... Read more
Dec 09 | అది 2012, డిసెంబర్ 16వ తేదీన.. తనను కట్టుకోబోయేవాడితో పాటు ఢిల్లీలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కిన పారామెడికల్ వైద్య విద్యార్థినికి ఆ రాత్రే కాళరాత్రిగా మారింది. ఇందుకు కారణమైన ఆరుగురిలో నలుగురికి అదే... Read more
Dec 09 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే అధికార, విపక్షాల మధ్య వేడిని రాజేస్తున్నాయి. సభ ప్రశ్నోత్తరాల సమయంలో అధికార-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యుత్ రంగంలో గోపాల్ రెడ్డి కమిటీ... Read more
Dec 09 | ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే ఔత్సాహికులకు వారి అదృష్టాన్ని పరీక్షించుకునే తరుణం వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అంటూ గత కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీని వచ్చే నెలలో... Read more