Bhadrachalam Belongs to Telangana భద్రాచలం తెలంగాణదే : తేల్చి చెప్పిన మంత్రి

Bhadrachalam belongs to telangana

Bhadrachalam, Indrakaran Reddy,Telangana

Bhadrachalam Belongs to Telangana

భద్రాచలం తెలంగాణదే : తేల్చి చెప్పిన మంత్రి

Posted: 06/14/2019 12:48 PM IST
Bhadrachalam belongs to telangana

రాములోరు కొలువుదీరిన పుణ్యక్షేత్రం భద్రాచలంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందా.. ఏపీకి ఇచ్చేస్తారా.. అన్న డిస్కషన్ నడుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణా దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భద్రాచలంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం ఎపీకి ఇవ్వాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్దలేదనీ భద్రాద్రి ఎపీకి ఇచ్చే విషయాన్ని కొట్టి పారేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల అభివృద్ధికి కలిసి పని చేస్తారని ఆయన పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోతుందని, వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకెళ్లింది. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. భద్రాచలం కూడా మాదే అన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. భద్రాచలం టాపిక్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తూనే ఉంది. తెలంగాణలో ఉన్న భద్రాచలాన్ని త్వరలోనే ఏపీలో విలీనం చేయనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్టు, కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు ప్రచారం జరిగింది. ఇటీవల రాజ్‌భవన్‌లో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌ సమావేశమైనప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని వార్తలు వచ్చాయి. విభజన చట్టం అంశాలు, రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారంపై చర్చ సందర్భంగా భద్రాద్రి విలీనాంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని సమాచారం. భద్రాద్రిని ఏపీలో కలిపేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారని చెప్పుకున్నారు. ఇంతలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhadrachalam  Indrakaran Reddy  Telangana  

Other Articles