Minimum Balance Requirement Removed బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు!

Minimum balance requirement removed

Minimum Balance, Account Holders, Withdrawals,RBI

Minimum Balance Requirement Removed

బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు!

Posted: 06/11/2019 02:29 PM IST
Minimum balance requirement removed

సేవలనూ ఉచితంగా పొందే అవకాశం ఆర్బీఐ కల్పించింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు కనీస సదుపాయాలకు తోడు చెక్ బుక్ తో పాటు ఇతర సేవలనూ ఉచితంగా పొందే అవకాశం ఆర్బీఐ కల్పించింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధనను ఆర్బీఐ తొలగించింది. నెలలో 4 సార్లు నగదు విత్ డ్రా (బ్యాంకులు, ఏటీఎంలు) చేసుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. ఈ మేరకు బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. ఈ సదుపాయాలు కల్పిస్తున్నందుకు అకౌంట్ లో కనీస బ్యాలెన్స్ ఉంచాలని బ్యాంకులు నిర్దేశించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. జూలై 1వ తేదీ నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి.

బేసిక్ సేవింగ్స్ ఖాతాలు అంటే ఎటువంటి కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా నిర్వహించుకునేందుకు వీలున్నవి. అయితే చెక్ బుక్ తో పాటు ఇతర సదుపాయాలు కోరితే.. బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలని అడుగుతున్నాయి. అందరికి ఆర్థిక సేవలను చేరువ చేసే లక్ష్యంలో భాగంగా బీఎస్ బీడీఏను సేవింగ్స్ ఖాతాగా కొన్ని రకాల సదుపాయాలు ఎటువంటి ఛార్జీలు లేకుండానే అందించాలని బ్యాంకులకు ఆర్బీఐ చెప్పింది.

కనీస సదుపాయాలకు అదనంగా బ్యాంకులు చెక్ బుక్ వంటి విలువ ఆధారిత సేవలనూ ఉచితంగానే అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు బీఎస్ బీడీఏ నిబంధలను ఆర్బీఐ సడలించింది. అంతేకాదు ఏటీఎంల నుంచి నెలలో 4 సార్లు ఉచితంగా క్యాష్ విత్ డ్రా, బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు, ఉచితంగా ఏటీఎం కమ్ డెబిట్ కార్డు జారీ వంటివి బీఎస్ బీడీఏలకు కనీస సదుపాయల్లో భాగంగా ఉన్నాయి.

 

 

 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minimum Balance  Account Holders  Withdrawals  RBI  

Other Articles