Yuvraj Singh Retires From International Cricket రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌

Yuvraj singh retires from international cricket

Yuvraj Singh, Yuvraj Singh news, Yuvraj Singh updates, Yuvraj Singh latest, Yuvraj Singh retirement, Yuvraj Singh cricket, Yuvraj Singh career, Yuvraj Singh career highlights

Indian star cricketer Yuvraj Singh decided to retire from International cricket along with IPL.

రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌

Posted: 06/11/2019 11:13 AM IST
Yuvraj singh retires from international cricket

భారత క్రికెట్ అనేది ఒక సామ్రాజ్యమయితే అందులో కొన్నేళ్లపాటు నిజంగానే యువరాజుగా వ్యవహరించాడు యువరాజ్ సింగ్. యువరాజ్‌ సింగ్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబయిలో తన రిటైర్మెంట్ ప్రకటన గురించే యువరాజ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశాడు. ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్, భవిష్యత్తు తదితర అంశాలపై వివరంగా మాట్లాడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆఖరి సారిగా ప్రాతినిధ్యం వహించిన యువరాజ్‌... జాతీయ జట్టు తరఫున రెండేళ్ల క్రితం 2017 జూన్‌లో ఆఖరి వన్డే ఆడాడు.

భారత్‌ తరఫున 400కు పైగా మ్యాచ్‌లు ఆడగలగడం నా అదృష్టం. నా కెరీర్‌ మొదలు పెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుందని ఏనాడూ ఊహించలేదు. పడ్డ ప్రతీసారి పైకి లేవడం ఎలాగో నాకు క్రికెట్‌ నేర్పించింది. విజయాలకంటే అపజయాలు నన్ను ఎక్కువగా పలకరించినా నేనెప్పుడూ ఓటమిని ఒప్పుకోలేదు. దేశం కోసం ఆడే సమయంలో నేను ఉద్వేగంతో ఉప్పొంగి పోయేవాడిని. జట్టు కోసం నేను చేసిన ప్రతీ పరుగు, తీసిన వికెట్, ఆపిన పరుగులు అన్నీ గొప్పగానే అనిపిస్తాయి. 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో భాగమయ్యాను. అంతకు మించి ఇంకేం కావాలి.

ఎలా రిటైర్‌ కావాలనే విషయంలో కొంత సందిగ్ధత నన్ను వెంటాడింది. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడి టైటిల్‌ గెలిచాక రిటైర్‌ అయితే సంతృప్తిగా ఉంటుందని భావించా. అయితే తుది జట్టులో నాకు చోటు దక్కలేదు. జీవితంలో అన్నీ అనుకున్నట్లు జరగవు. సంవత్సరం క్రితమే ఈ ఏడాది ఐపీఎల్‌ తర్వాత తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఇక ఆడింది చాలు అనిపించిన సమయం వచ్చేసింది. రిటైర్‌ అవడానికి ముందు సచిన్‌ సలహా తీసుకోవడంతో పాటు సహచరులు జహీర్, భజ్జీ, వీరూలకు చెప్పా. చాలా కాలం తర్వాత నాన్నతో కూడా సుదీర్ఘంగా మాట్లాడి నా నిర్ణయాన్ని చెప్పాను. ఇకపై ఆటను ఆస్వాదించేందుకే బయటి లీగ్‌లలో పాల్గొనాలనుకుంటున్నా.

అయితే తాను కేవలం క్రికెట్ కు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని యువరాజ్ అన్నాడు. క్యాన్సర్ అనేది ఎంత  భయంకరమైన జబ్బో... ఆత్మవిశ్వాసంతో దాన్ని ఎదుర్కొంటే అంత తొందరగా నయమయ్యే వ్యాధి అని తెలిపాడు. ఈ విషయం తాను క్యాన్సర్ తో పోరాడి తెలుసుకున్నానని అన్నారు. కాబట్టి ఇకమీదట  క్యాన్సర్ తో బాధపడేవారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఆ మహమ్మారి నుండి వారిని కాపాడటమే లక్ష్యమన్నాడు. ఇలా వీలైనంత మేరకు క్యాన్సర్ బాధితులకు సేవ చేయడానికే తన సమయాన్ని కేటాయిస్తానని యువరాజ్ పేర్కొన్నాడు.

ఇక క్రికెటర్ గా ఎదగాడానికి తనకు సహకరించిన తల్లితదండ్రులకు, మిత్రులకు, సహచర క్రికెటర్లకు యువరాజ్ కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో తన వెన్నంటి నిలబడి ధైర్యాన్నిచ్చిన అభిమానులను తానెప్పటికి మరిచిపోనని అన్నాడు. క్యాన్సర్ బారినపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడున్న సమయంలో వారు తన కోసం ఆ దేవున్ని ప్రార్థించారని...అందువల్లే అంత తొందరగా క్యాన్సర్ ను జయించగలిగానని తెలిపాడు. అభిమానుల  ఆశిస్సులు...క్రికెట్లో నేర్చకున్న పోరాటం, ఒడిదుడుకులను దాటుకుంటూ ముందుకు సాగడమే తనను మళ్లీ ఇలా మీముందు నిలబడేలా చేశాయని యువరాజ్ భావోద్వేగంగా మాట్లాడాడు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yuvraj Singh  Cricket  Retirement  

Other Articles