Russia firm offers women extra pay to wear skirts మహిళా ఉద్యోగులూ.. బోనస్ కావాలంటే ఇవి తప్పనిసరి.!

Russian company offers women extra pay to wear skirts and make up to work

Russian company, skirts dresses etc, sochi, Tatprof, Tatprof sexism, Tatprof sexism accurations, womens bodies, womens clothing, femininity, Disgusting abuse of power, exploiting women, Russian Tatprof company, CEO Sergei Rachkov

A Russian company is facing fierce criticism for offering female workers cash bonuses to wear skirts or dresses to work as part of a "femininity marathon" and an attempt to help with "team bonding".

మహిళా ఉద్యోగులూ.. బోనస్ కావాలంటే ఇవి తప్పనిసరి.!

Posted: 06/01/2019 04:45 PM IST
Russian company offers women extra pay to wear skirts and make up to work

మీరు మహిళా ఉద్యోగులా.. అయితే మీకు ఏడాదికో పర్యాయం మీ కంపెనీ అందించే బోనస్ కావాలా.? అయితే మీకో్ షరతు వుంది. మీరు శరీరాన్ని పూర్తిగా కప్పేసుకునే బట్టలకు సెలవిచ్చి.. ఇకపై మోకాళ్లు కిందకు 5 సెంటీమీటర్లకు ఎక్కువకాకుండా పోట్టిగా వుండే దుస్తులు వేసుకుని రావాలి. అంతే అనుకుంటున్నారా.. దీంతో పాటు రోజు నీట్ గా మేకప్ అయ్యి రావాలి. ఈ రెండు కండీషన్లు అంగీకరిస్తే మీ బోనస్ మీ జేబులో.. అంటూ ఓ కంపెనీ షరతు విధించింది. అయితే బోసన్ కావాలంటూ బంఫర్ ఆఫర్ అని దీనిని ప్రచారం కూడా చేసింది.

ఇంకేముందు ఈ కంపెనీ పూర్తిగా విమర్శలపాలు అవుతోంది. మహిళా సంఘాల నేతలు ఈ కంపెనీ ఎక్కడుందీ.? అడ్రస్ ఏంటని అడుగుతున్నారు. అయితే ఇప్పటికే మహిళా హక్కుల కార్యకర్తలతో పాటు నెట్ జనులు కూడా ఈ కంపెనీని ట్రాల్ చేస్తున్నారు. రష్యాలో టాట్ ప్రాఫ్ అనే అల్యూమినియం తయారీ సంస్థ ఈ చర్యలకు పాల్పడి తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కోంటోంది. 2014లో రష్యాలో నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్ కు అల్యూమినియం ఉపకరణాలు సమకూర్చింది ఈ సంస్థే.

అయితే, టాట్ ప్రూఫ్ తమ కార్యాలయాల్లో ఫెమినిటీ మారథాన్ అని మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. ఇది నెలరోజుల ఈవెంట్. ఇందులో భాగంగా మహిళా ఉద్యోగులు మోకాళ్లపైకి ఉండేలా స్కర్టులు ధరించి, ఫుల్ మేకప్ తో వస్తే వారికి రోజుకు 100 రూబుళ్లు (భారత కరెన్సీలో రూ.107) బోనస్ గా ఇస్తామని టాట్ ఫ్రూఫ్ యాజమాన్యం ప్రకటించింది. ఈ ఆఫర్ అంగీకరించే మహిళలు ఓ ప్రత్యేక నంబర్ కు తమ ఫొటోలను పంపాల్సి ఉంటుంది. కానీ, ఈ ఆఫర్ పై రష్యాలో మహిళా సంఘాలు, నెటిజన్ల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తోంది.

మహిళా ఉద్యోగులు కాదు యాజమాన్యమే మేకప్ వేసుకుని రావాలని ఓ నెటిజన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడున్నాం మనం, మధ్యయుగంలో కాదు కదా! అంటూ మరో వ్యక్తి స్పందించారు. అధికారముందన్న డబ్బు అహన్ని చూపుతున్నారని, మహిళలను అటవస్తువులను చేసి అడుకుంటున్నారని ఇలా అనేక రకాలుగా నెట్ జనులు కంపెనీ యాజమాన్యాన్ని ట్రాల్ చేస్తున్నారు. రష్యాలోని కార్పోరేట్ కల్చర్, అంతర్గత సమాచార శాఖ కూడా ఈ విషయమై స్పందిస్తూ ఈ ఐడియా కంపెనీ సీఈవో నుంచే ఉత్పన్నమైనదని తెలిపింది. మరోవైపు కంపెనీ యాజమాన్యం మాత్రం తాపీగా మహిళలను లైంగిక వేధింపులు గురిచేస్తున్నారన్న వాదనలను తోసిపుచ్చింది. ఇప్పటికే తమ పోటీలలో ఏకంగా 60 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని పేర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russian company  skirts dresses etc  sochi  Tatprof  Tatprof sexism  womens clothing  feminism  

Other Articles