Galla Jayadev elected TDPP leader in Parliament టీడీపీ పార్లమెంటరీ పక్ష నేతగా గల్లా జయదేవ్..

Galla jayadev elected telugu desam parliamentary party leader in parliament

Telugu Desam Party, N. Chandrababu Naidu, Telugu Desam Parliamentary Party, TDPP Leader, Galla Jayadev, TDLSP, RamMohan Naidu, TDRSP, Sujana Chowdary, Andhra Pradesh Assembly, CM YS Jagan, leader of the opposition, Chandrababu, Andhra Pradesh, Politics

Telugu Desam party President and Former Chief Minister N Chandrababu Naidu had elected Galla Jayadev as TDPP Leader of the Party, along with Ram mohan naidu as TDLSP and Sujana Chowdary as TDRSLP leader.

టీడీపీ పార్లమెంటరీ పక్ష నేతగా గల్లా జయదేవ్..

Posted: 05/29/2019 05:23 PM IST
Galla jayadev elected telugu desam parliamentary party leader in parliament

టీడీపీ పార్లమెంటరీ పక్ష నేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. లోక్ సభలో పార్టీ నేతగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, రాజ్యసభలో నేతగా ఎంపీ సుజన చౌదరి వ్యవహరించనున్నారు. టీడీఎల్పీ నేతగా చంద్రబాబు నాయుడును పార్టీ శాసనసభ్యులు ఏకవాక్య తీర్మాణంతో ఎంపిన చేసిన తరువాత.. పార్లమెంటరీ పక్ష నేతగా గల్లా జయదేవ్ ను నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.

ఇక గల్లా జయదేవ్ తో పాటుగా లోక్ సభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కవాలని డిమాండ్ చేస్తూ తన వాణిని బలంగా వినిపించిన రామ్మోహన్ నాయుడును కూడా పార్టీ లోక్ సభ పక్ష నేతగా నియమించారు. ఇక రాజ్యసభలో సీనియర్ పార్టీ నేత.. మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరినీ రాజ్యసభ పక్షనేతగా నియమించారు. మరోవైపు జగన్‌ ప్రమాణస్వీకారం నేపథ్యంలో గురువారం ముగ్గురు ఎమ్మెల్యేలతో కూడిన టీడీపీ సభ్యుల బృందం తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లనుంది. టీడీపీ తరఫున రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు శుభాకాంక్షలు తెలుపనుంది. టీడీపీ సభ్యుల బృందంలో అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, గంటా శ్రీనివాసరావు జగన్‌ ఇంటికి వెళ్లి కలవనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles