BJP leading in 288 seats, may get majority on its own లోక్ సభ ఫలితాల్లో బీజేపి ముందంజ: దూసుకుపోతున్న అభ్యర్థులు

Election result bjp leading in 288 seats may get majority on its own

lok sabha election results, lok sabha election results 2019, todays election results 2019, live election results 2019, election results live, today election results live updates, election results, election results, Elections, UPA, NDA, BJP, Congress, DMK, PM Modi, Rahul Gandhipolitics

Prime Minister Narendra Modi's BJP has crossed the halfway mark on its own. The NDA is ahead in more than 300 seats. The BJP is doing well in most states, including the three heartland states of Rajasthan, Madhya Pradesh and Chhattisgarh

లోక్ సభ ఫలితాల్లో బీజేపి ముందంజ: దూసుకుపోతున్న అభ్యర్థులు

Posted: 05/23/2019 10:59 AM IST
Election result bjp leading in 288 seats may get majority on its own

కేంద్రంలో మరోమారు బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే పార్టీ అధికారం అందుకునే దిశగా పయనం సాగిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ.. దేశవ్యాప్తంగా మూడువందల లోక్ సభ స్థానాలకు పైగా బీజేపి అభ్యర్థులు ముందంజలో వున్నారు. ఇక విజయాన్ని రమరమి దూసుకుపోతున్నారు. ఫలితాల సరళి పరిశీలిస్తే బీజేపి సొంతంగానే అధికారాన్ని అందుకునే దిశగా పరుగులు తీస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోనూ బీజేపి తన సత్తాను చాటింది. నరేంద్రమోడీ సర్జికల్ స్ట్రైక్స్ ప్రభావం దేశప్రజలను అకర్షితులను చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో గెలిచిన రాజస్తాన్; మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లోనూ బీజేపికి అనుకూలంగా ఓటర్లు తీర్పునిచ్చారు. ఆయా రాష్ట్రాల్లోనూ బీజేపి అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. వీటితో పాటు కర్ణాటక, ఢిల్లీలలో బీజేపి అధిక్యం కనబరుస్తోంది. ఇదిలావుండగా, కాంగ్రెస్ కేవలం పంజాబ్, తమిళనాడులో ముందంజలో కొనసాగుతుంది. బీహార్ రాష్ట్రంలోని బేగుసరాయ్ నుంచి తన సమీప సీపీఐ ప్రత్యర్థి కన్నయ్యకుమార్ పై గిరిరాజ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. ఢిల్లీలో నార్ ఈస్ట్ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై బీజేపి అభ్యర్థి మనోజ్ తివారి ముందంజలో వున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో హమీర్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి అనురాగ్ ఠాకూర్ తన ప్రత్యర్థిపై 9,500 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ లో సునీల్ జాకర్ పై సినీనటుడు, బీజేపీ అభ్యర్థి సన్నీడియోల్ ముందంజలో ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో షీలాదీక్షిత్ పై బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ ఆధిక్యంలో ఉన్నారు. కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే 33, 222 ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. టీఎంసీ అభ్యర్థిని మూన్ మూన్ సేన్ పై బీజేపీ అభ్యర్థి బాబుల్ సుప్రియో ముందంజలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lok sabha elections results  UPA  NDA  BJP  Congress  DMK  PM Modi  Rahul Gandhi  politics  

Other Articles