TDP ministers including Nara Lokesh Trails వెనుకంజలో మంత్రులు, మంగళగిరి లోకేష్ కూడా..

Mangalgiri assembly nara lokesh trails by over 10 000 votes

Telugu Desam Party, Alla Ramakrishna reddy, Nara Lokesh, AdiNarayana Reddy, Ayyanna Patrudu, N. Chandrababu Naidu, Andhra Pradesh, Telugu people, Government of India, YS Jagan, Chief Minister, actor-turned-politician, Prime Minister, YSRCP, TDP, BJP, Janasena, Congress, Chandrababu, Andhra Pradesh, Politics

Nara Lokesh the debutant in Andhra Pradesh assembly elections trails by over 10,000 votes, along with him many ministers somireddy chandramohan reddy, adinarayana reddy, ayyanna patrudu all are in trail.

వెనుకంజలో మంత్రులు, మంగళగిరి లోకేష్ కూడా..

Posted: 05/23/2019 11:56 AM IST
Mangalgiri assembly nara lokesh trails by over 10 000 votes

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఏకపక్ష విజయం దిశగా దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీకి చెందిన మంత్రులను, సీనియర్ నేతలను కూడా తన ప్రభంజనంలో కోట్టుకుపోయేలా చేస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఏపీ ఐటీశాఖా మంత్రి నారా లోకేష్ కూడా వైసీపీ ఫ్యాను గాలికి అడ్రస్ గల్లంతయ్యేలా చేసింది. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను అకర్షించిన మంగళగిరి అసెంబ్లీ స్తానంలో అనూహ్య ఫలితాలు నమోదు అవుతున్నాయి. అక్కడ కూడా వైసీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

తాజాగా గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి, ఏపీ మంత్రి నారా లోకేశ్ పై వేల ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలోని 17 స్థానాల్లో వైసీపీ 9 చోట్ల, టీడీపీ 2 చోట్ల లీడింగ్ లో ఉన్నాయి. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం వైసీపీ 147, టీడీపీ 24, జనసేన 1 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. అలాగే లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలకు గానూ వైసీపీ 23 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుండగా, టీడీపీ రెండు స్థానాల్లో దూసుకుపోతోంది.

ఇక టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా వున్నవారు కూడా పరాజయం బాటలో కొనసాగుతున్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మంత్రి అయ్యన్న పాత్రుడు, మంత్రి నక్కా ఆనంద్ బాబు, సహా పలువురు మంత్రులు వెనకంజలో వున్నారు. ఇక టీడీపీ పార్టీ తరపును ప్రముఖులు కూడా ఐదవ రౌండ్ పూర్తేయ్యే వరకు వెనుకంజలో కొనసాగుతున్నారు. సీనియర్ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి తదితరులు కూడా వెనుకబడ్డారు. ఈ ఫలితాలతో నైరాశ్యంలో పడ్డ టీడీపీ నేతలు, ఇప్పటివరకు మీడియా ముందుకు కూడా వచ్చేందుకు సాహసించడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles