2 injured after helicopter crashes into the Hudson River నదిలో హెలికాప్టర్ కుప్పకూలినా.. పైలట్ పై ప్రశంసలు..

Helicopter pilot miraculously survives crash into new york s hudson river

helicopter emergency landing into River, helicopter crashed into river, hudson river helicopter crash, newyork helicopter crash, Zip Aviation, Hudson River, passenger ferry, Pilot injured, New York, Crime

A helicopter pilot is lucky to be alive after his aircraft was forced to make an emergency landing into New York’s Hudson River. A helicopter operated by Zip Aviation crashed into the water with only the pilot on board, a Blade spokesperson confirmed.

ITEMVIDEOS: నదిలో హెలికాప్టర్ కుప్పకూలినా.. పైలట్ పై ప్రశంసలు..

Posted: 05/17/2019 02:45 PM IST
Helicopter pilot miraculously survives crash into new york s hudson river

న్యూయార్క్‌లోని హడ్సన్ నది మీదుగా వెళ్తున్న ఓ హెలికాప్టర్ అదుపుతప్పి కూలిపోయింది. మాన్ హట్టన్ నుంచి  టేకాఫ్ అయిన కాసేపటికే గాల్లో వున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. అంతే.. ఎలాగైనా కూప్పకూలిపోక తప్పదని తెలిసిన ఫైలట్ దానిని నదిలోనే పడేట్లు చేసి ప్రాణనష్టం లేకుండా చేయడంతో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఎందుకలా అంటే అదే సమయంలో నదిలో ఓ బోటు ప్రయాణికులతో వెళ్తుంది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు.

అసలేం జరిగిందంటే.. హడ్సన్ నది మీదుగా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తడంతో గాలిలో అది గింగిరాలు తిరిగింది. క్రమంగా  కిందికి జారుతూ వచ్చింది. అదే సమయంలో కింది నుంచి ఓ బోటు ప్రయాణిస్తుండడంతో అందరూ హడలిపోయారు. సాంకేతిక లోపం తలెత్తినా.. నదిలో వెళ్తున్న బోటులో ప్రయాణికులను గమనించి అది అక్కడి నుంచి వెళ్లేంత వరకు గాల్లోనే హెలికాప్టర్ వుంటేందుకు పైలట్ చేసిన ప్రయత్నం ప్రశంసలను అందుకుంటోంది. అయితే, బోటు ఆ ప్రాంతం నుంచి కొంత ముందుకు రాగానే గింగిరాలు తిరుగిన హెలికాప్టర్ లో మంటలు వ్యాపించాయి.. ఆ వెనువెంటనే అది నదిలో కుప్పకూలింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.

పెద్ద శబ్దంతో హెలికాప్టర్ కూలిన వెంటనే బోటులోని వారు స్పందించి అందులో చిక్కుకున్న పైలట్ ను రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రాణనష్టం ఏమీ లేదని, పైలట్‌ సహా మరొకరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఇది టెయిల్ రూటర్ ఫెయిల్యూర్ వల్లే జరిగిందని, పైలట్ అప్రమత్తతే ఎలాంటి విధ్వంసం కాకుండా కాపాడిందని కొనియాడుతున్నారు నెట్ జనులు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్ పిచ్ ను గట్టిగా లాగి ఆ తరువాత రిలీజ్ చేశాడని దాంతోనే బోటు వెళ్లేంత వరకు అది గాల్లో నిలిచిందని, ఆ తరువాతే గింగిరాలు తిరిగి నదిలో కుప్పకూలిందంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : helicopter  crash  Zip Aviation  Hudson River  passenger ferry  Pilot injured  New York  Crime  

Other Articles